Suryaa.co.in

Andhra Pradesh

ధాయ్ ల్యాండ్ లో అరెస్టైన వారిపై ఈడీ ప్రత్యేక విచారణ కోరుతూ లేఖ రాయండి

జూదం నిర్వహిస్తూ ధాయ్ ల్యాండ్ లో అరెస్టైన తెలుగువారి గురించి డీజీపీకి లేఖ రాసిన తెదేపా నేత వర్ల రామయ్య

• 2022 జనవరిలో కొడాలినాని గుడివాడలో అక్రమ క్యాసినో నిర్వహించారు.
• నాడు మధ్యం ఏరులై పారించి అశ్లీల నృత్యాలతో జూదం ఏర్పాటు చేశారు.
• కె-కన్వెషన్ లో జూదం ఆడేందుకు డబ్బులు లేనివారికి స్పాట్ లో లోన్ పొందే ఏర్పాట్లు కూడా చేశారనే వార్తలు వచ్చాయి.
• జూదంలో పాల్గొన్న అనేకమంది స్థిర, చర ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు.
• దాదాపు రూ.500 కోట్లు వరకు వ్యాపారం జరిగినట్లు సమాచారం.
• అక్రమ క్యాసినో కోసం తీసుకొచ్చిన అమ్మాయిలు ఇండిగో విమానంలో విజయవాడ నుంచి బెంగుళూరు ప్రయాణం చేసారు.
• గుడివాడ అక్రమ క్యాసినో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి మేం నాడు పిర్యాదు కూడా చేశాం.
• దీనిపై విచారణ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ నూజివాడు డీఎస్పీ ని ఆదేశించారు. కానీ, విచారణ సరిగా చేయలేదు.
• అక్రమ క్యాసినోపై తెదేపా అధినేత ఒక నిజనిర్ధారణ కమిటీ వేయడం జరిగింది.
• నిజనిర్ధారణ కమిటీ గుడివాడ వెళ్లే క్రమంలో వైకాపా గూండాలు అడుగడుగున అడ్డుకున్నారు.
• నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు కె-కన్వెషన్ సెంటర్ లోకి అనుమతించలేదు.
• నిజనిర్ధారణ కమిటీ రిపోర్టుతో అక్రమ క్యాసినో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్సీని, కలెక్టర్ ను సైతం కోరాం.
• డీజీపీని(తమరిని) కలిసే ప్రయత్నం చేసినప్పటికీ వైకాపానేతల వత్తిడితో కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు.
• నేటి వరకు నూజివాడు డీఎస్సీ అక్రమ క్యాసినోపై ఎటువంటి నివేదిక ఇవ్వలేదు.
• ఇదే అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తినప్పటికీ ఎటువంటి సమాధానం చెప్పలేదు.
• కానీ, ఎన్స్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ వారు హైదరాబాద్ లో చీకోటి ప్రవీణ్ ను అరెస్టు చేసి అతనిపై గుడివాడ అక్రమ క్యాసినో నిర్వహణపై కూడా విచారణ చేశారు.
• ఆదాయపుపన్ను శాఖ వారు సైతం దీనిపై విచారణ మొదలుపెట్టి నా దగ్గర ఉన్న ఆధారాలు సైతం అడగటం జరిగింది.
• చేసిన పాపాలను కర్మ విడిచిపెట్టదన్నట్లు గుడివాడ అక్రమ క్యాసినో నిర్వహకులు ధాయ్ ల్యాండ్ పోలీసుల చేతిలో అరెస్టు అయ్యారు.
• చీకోటి ప్రవీణ్ నుంచి దాదాపు రూ.100 కోట్లు నగదు, నిషేదించబడ్డ బారాకు అనే హుక్కా పరికరాన్ని ధాయ్ ల్యాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
• ఇంతపెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరగతుండటం జాతీయ భద్రతకే పెనుముప్పు.
• ఏపీ పోలీసులు చేయలేని పని ధాయ్ పోలీసులు చేసి చూపారు.
• మేం గతంలో అక్రమ క్యాసినో నిర్వాహకులపై అనేక పిర్యాదులు చేసినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పోలీసులు వారికి సహకరించారు.
• కొంతమంది పోలీసు అధికారుల సహకారంతో వైకాపా గూండాలు టిడిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులపై దాడి చేశారు.
• 2022 జనవరిలోనే మేం చెప్పినట్లు అక్రమ క్యాసినో నిర్వహకులపై చర్యలు తీసుకుని ఉంటే తెలుగువారు నేడు క్షేమంగా ఉండేవారు.
• వైకాపా నాయకుల కారణంగా కొంతమంది పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నేడు తెలుగువారు ధాయ్ ల్యాండ్ జైల్లో మగ్గే పరిస్థితి వచ్చింది.
• ఇప్పటికైనా తమరు స్పందించి నూజివీడు డీఎస్పీ చేసిన ఎన్క్వయిరీ రిపోర్టును బయటపెట్టండి.
• పెద్ద ఎత్తున జరుగుతున్న మనీ లాండరింగ్ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి ఈడీ ప్రత్యేక విచారణ కోరుతూ లేఖ రాయండి.
• తెలుగువారిని ధాయ్ ల్యాండ్ జైలు నుంచి విడిపించి రాష్ట్రానికి తీసుకురండి.
• గుడివాడ అక్రమ క్యాసినో నిర్వాహణపై నిస్పాక్షిక విచారణ చేసేలా నిజాయితీపరుడైన అధికారిని నియమించండి.

LEAVE A RESPONSE