Suryaa.co.in

Features

యగ్జ్న్యోపవీతం_బరువు

ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు బాగా బక్కచిక్కిన ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు. కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆరాజు, హేళనగా “నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తోధన మివ్వాలా” అంటాడు.

దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు “అంత అవసరం లేదు మహారాజా, ఈ ఉదయం నేను యజ్నోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన ‘జీర్ణయజ్నోపవీతం’ ఉన్నది దానెత్తు ఇచ్చిన చాలునంటాడు.
వీడో పిచ్చాడనుకుని ఆరాజు, కోశాధికారితో వీనికోరెండు కాసులిచ్చి పంపమంటాడు.

దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్నోపవీతమెత్తే కావాలని పట్టుబడతాడు.
దానికా రాజు ‘సరదాగా ఆ వేడుక చూద్దామనుకుని, తాసు తెప్పించి తూచి ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు’.
కానీ, వింత ! ఎంత ధనం వేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరితూగలేదు.
దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం.

దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆ బక్క బ్రాహ్మణుని శక్తి తెలీయవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.

– రాజేంద్ర

 

LEAVE A RESPONSE