Suryaa.co.in

Andhra Pradesh

420 పనులకు టీడీపీ వత్తాసా..?

– “సైకిల్-కాంగ్రెస్” హయాంలోనే అడ్డదారిలో అశోక్ బాబు పదోన్నతి
-లోకాయుక్త ఆదేశిస్తేనే సీఐడీ విచారణ చేపట్టింది, దానినీ తప్పుబడతారా?
– అశోక్ బాబు “ఫేక్ బాబు” అని నాడు ఎల్లో మీడియా కూడా చెప్పింది
-చంద్రబాబు పంచన చేరాక “ఫేక్ బాబు.. ఉత్తమ్ బాబు” అయిపోయాడా?
-సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన ద్రోహి అశోక్ బాబు
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్

నాగార్జున యాదవ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఫోర్జరీ సర్టిఫికెట్లతో, ప్రభుత్వ సర్వీసు రికార్డుల్లో ట్యాంపరింగ్ చేసి.. పదోన్నతలు పొందిన అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో.. నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, ఉలికిపాటుకు గురి అవుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అశోక్‌ బాబు అక్రమాలను సమర్థిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన చెంచా బృందాలను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రజల తరఫున సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాం.

1- అశోక్ బాబు చదవని డిగ్రీతో పదోన్నతి పొందిన మాట వాస్తవమా.. కాదా?
2- లోకాయుక్త ఆదేశాల మేరకే సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేసింది నిజం కాదా?
3- ప్రమోషన్ కోసం అశోక్ బాబు సర్వీసు రికార్డులు ట్యాంపరింగ్ చేశాడా.. లేదా..?
4- అశోక్ బాబుకు ఒరిజినల్ గా ఉన్న అర్హత ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద కమర్షియల్ ట్యాక్స్ హెడ్ ఆఫీసులో ఉద్యోగం పొందటం అశోక్ బాబుకు ఎలా సాధ్యమైంది…?
5- డిగ్రీ ఫోర్జరీ సర్టిఫికేట్ పై తోటి ఉద్యోగులే కంప్లైంట్ చేశాక, దాని నుంచి తప్పించుకునేందుకు డీ.కామ్(డిప్లమో ఇన్ కంప్యూటర్స్) – బీ.కామ్… అంటూ నాటకం ఆడింది నిజం కాదా…?
6- 420 పనులు చేసిన అశోక్ బాబు సమర్థిస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?

2- లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతోనే టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికేదో, ముఖ్యమంత్రిగారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు.

– ఇదే అశోక్‌ బాబు ఎమ్మెల్సీగా ఎన్నిక సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌లో ఇంటర్మీడియెట్‌ తన క్వాలిఫికేషన్‌ అని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ అఫిడవిట్‌ 1976లో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించానని చెప్పారు. దాంతో అశోక్‌ బాబు ఇంటర్‌ వరకే చదివారన్నది క్లియర్‌. మరి ఇంటర్‌ చదివిన వ్యక్తి కమర్షియల్‌ ట్యాక్స్‌ హెడ్‌ ఆఫీస్‌లో ఎస్టీవోగా బాధ్యతలు స్వీకరించడం సాధ్యమా? ఎవరి మోచేతి నీళ్లు తాగితే ఎస్టీవోగా అశోక్ బాబు పని చేయగలిగారు.

3- అశోక్‌ బాబు డిగ్రీ చదవకపోవడాన్ని మేము నేరం అనడం లేదు. చదవని డిగ్రీని చదివినట్లు ఫోర్జరీ సర్టిఫికేట్లు పెట్టి, ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి, ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిన తీరును మేము ఆక్షేపిస్తున్నాం. 2013లో “సైకిల్‌ – కాంగ్రెస్‌” అధికారంలో ఉన్నప్పుడు తొలిసారి అశోక్ బాబుకు చెందిన ఫేక్‌ డాక్యుమెంట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను చేసిన తప్పు కప్పిపుచ్చుకునే క్రమంలో, అశోక్‌బాబు చంద్రబాబు పంచన చేరాడు.

ఇదే అవకాశంగా చంద్రబాబు ఎన్జీవో నాయకుడిగా ఉన్న అతన్ని లోబరుచుకుని, సమైక్య ఉద్యమంలోకి అతడిని చొప్పించి, ఆ ఉద్యమాన్ని ఏ విధంగా నీరుగార్చారో చూశాం. ఆ తర్వాత 2018 నవంబర్ ‌9న పరుచూరి అశోక్‌ బాబుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ.. లేఖ రాసి మరీ విచారణను చెత్తబుట్టలో పడేసిన మాట వాస్తవమా కాదా? దానికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. మీరు తప్పులు చేసి, తప్పుడు పనులను, తప్పుడు వ్యక్తులను ప్రోత్సహించి.. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం మంచిది కాదు.
4- ఇందులో కక్ష సాధింపులు ఎక్కడైనా ఉన్నాయా…? తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం కోర్టులకు, చట్టానికి లేదా…?. తమకు ఉన్న ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో లోకాయుక్తా 2021 ఆగస్ట్‌ 16న పూర్తి స్థాయి విచారణ చేయాలని సీబీసీఐడీకి ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే వివిధ సెక్షన్ల ప్రకారం 2022 జనవరిలో సీబీసీఐడీ పోలీసులు అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేయడం వాస్తవమా కాదా?

5- చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతల మాటలు ఎలా ఉన్నాయంటే… “అక్రమాలు, ఫోర్జరీలు, తప్పుడు పనులు, దమనకాండ చేసినా వారిని మేము కాపాడుకుంటాం, అలాంటివాళ్లను చంద్రబాబు నాయుడు భుజాల మీద వేసుకుని మోస్తారు” అన్నట్టు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఫేక్‌ డాక్యుమెంట్లు, రికార్డులు ట్యాంపరింగ్‌లు చేసిన అశోక్ బాబు లాంటి వ్యక్తులను తెచ్చి, ఎమ్మెల్సీలను చేసిన చంద్రబాబునాయుడిని ఏమనాలి?. ఇలాంటి దొంగలు చట్టసభల్లో అడుగుపెట్టి ఏవిధంగా ప్రజలకు సేవ చేస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు భజన బృందంలోని కొన్ని శక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంలోకి జొరబడి ఉద్యోగుస్తుల్లోనూ, సమాజంలోనూ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించారా.. లేదా అని అడుగుతున్నాం.

6- పదోన్నతుల కోసం రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి, ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించిన ఇదే అశోక్ బాబు గురించి గతంలో ఎల్లో మీడియాలో ఫేక్ బాబు అని వార్తలు ప్రసారం చేశారు. 2017 ఆగస్ట్‌ 24న ఎల్లో మీడియాకు సంబంధించిన ఓ టీవీ ఛానల్‌(టీవీ5)లో ‘ఫేక్‌ బాబు’ అంటూ గంటల కొద్దీ వార్తలను ప్రసారం చేసింది. ఈరోజు అదే అశోక్ బాబు… చంద్రబాబు నాయుడు పంచన చేరేసరికి “ఫేక్‌బాబు – ఉత్తమ బాబు “గా ఎలా మారిపోయాడని ఆ ఎల్లో మీడియాను అడుగుతున్నాం.

7- ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తయారు చేసిన ఫేక్‌ బీకాం డిగ్రీ సర్టిఫికేట్‌తో ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి, సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా తాను తప్పు చేశానని ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పకుండా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత కూడా డి.కామ్‌ బదులు పొరపాటున బి.కామ్‌ రాశారంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు. తన కుట్రలో భాగంగానే అశోక్‌ బాబు ఫేక్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి పదోన్నతి పొందారు అనటానికి అనేక సాక్ష్యాలు దొరికాయి.

8- ఫేక్‌ సర్టిఫికెట్లు సృష్టించి, 420 పనులకు పాల్పడే వారిని వెనకేసుకొస్తున్న టీడీపీని ఏమనాలి… 420 పార్టీ అనాలా..?. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, కుంభకోణాలు అన్నీ.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, మీ పాపం ఏదో ఒకరోజు బద్ధలవుతుంది. మీకు బాకా ఊదే కొన్ని మీడియా ఛానల్స్‌ను అడ్డుపెట్టుకుని రోజా ప్రభుత్వంపై బురదజల్లినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు.

9- బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇలాంటి చర్యల ద్వారా అశోక్ బాబు రాష్ట్ర పరువు తీశారు. ఇలాంటి వ్యక్తి ఎన్జీవో నాయకుడిగా ఉండి ఉద్యోగుల్ని ఉద్యమం వైపు నడిపించి, మరోవైపు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కుమ్మక్కై సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన ద్రోహి.

ఫేక్‌ సర్టిఫికెట్‌ విషయంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా అశోక్‌బాబును అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ.. చంద్రబాబు నుంచి లోకేష్ వరకు అంతా రంకెలేస్తున్నారు. ఒక కేసులో దొరికిపోయిన దొంగను అరెస్ట్‌ చేశాక కూడా ఇలాంటి సెక్షన్లు, ఎందుకు పెట్టాలని మాట్లాడుతున్నారు. చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియా ఆడుతున్న నయా వెన్నుపోటు సంస్కృతిని చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

LEAVE A RESPONSE