Suryaa.co.in

Andhra Pradesh

పోలీసుల కనుసన్నల్లోనే మాచర్ల విధ్వంసకాండ

శాసనమండలి ప్రతిపక్షనేత యనమల

ఎపిలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొనసాగుతుందనడానికి నిన్నరాత్రి మాచర్లలో జరిగిన ఘటన నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ముందుగా నిర్ణయించిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ఇన్ ఛార్జి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో ప్రశాంతంగా నిర్వహిస్తున్న సమయంలో వైసిపి మూకలు ఒక్కసారిగా మారణాయుధాలతో విరుచుకుపడి బ్రహ్మారెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించాయి.

పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంతోపాటు బ్రహ్మారెడ్డి ఇంటిని పెట్రోలుపోసి తగులబెట్టారు. దాదాపు మూడుగంటలపాటు వైసిపి మూకలు మాచర్లలో విధ్వంసకాండకు తెగబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? డిజిపితోపాటు ఇతర పోలీసు అధికారులంతా గుంటూరులో ఉండగానే ఈ విధ్వంసకాండ కొనసాగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్ఝప్తి చేస్తుంది.

LEAVE A RESPONSE