-సంక్షేమ పథకాల్లో నిబంధనలు పెట్టి లక్షలాది మందిని తొలగించారు
-దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు చేశారు
-సంక్షేమంలో పెట్టిన కోతలపై జగన్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయగలడా?
– యనమల రామకృష్ణుడు
జగన్ రెడ్డికి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కరించడంపై లేదు. ప్రజాస్వామ్యంలో అన్నింటికంటే ముఖ్యమైనవి సమసమాజ, నవ సమాజ స్థాపనలు. వీటిని జగన్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ రెడ్డి చెప్పే మాటలు నేతబీరకాయలో నెయ్యి చందంలా ఉన్నాయి. జగన్ రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయం పెద్ద బూటకం. జగన్ చేస్తున్న సామాజిక న్యాయం కంటే ఆయన చేసిన సామాజిక అన్యాయమే ఎక్కువ. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి సామాజిక విద్రోహానికి శ్రీకారం చుట్టాడు జగన్ రెడ్డి. పేద, మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేయకపోగ సామాజిక న్యాయం జరిగిందని బుకాయిస్తున్నాడు. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, తెల్ల రేషన్ కార్డులు, రైతు భరోసా….ఇలా ప్రతీ పథకంలో కోతలు పెట్టారు. పథకాలపై నిబంధనలు పెట్టి లక్షలాధిమందిని తొలంగించారు. దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి. జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ప్రతిపక్షాలు, పత్రికలు, మేదావులు అభిప్రాయపడుతున్నారు. కానీ జగన్ రెడ్డి నిస్సిగ్గుగా ప్రజలు సంతోషంగా ఉన్నారని మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం కోసం మూడు సంవత్సరాలలో జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలి. జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా సంక్షేమంలో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.