-బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్సార్ సహాయం చేశారు
-వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు
-ఎన్‌టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదు
-వైఎస్సార్ పేరు పెట్టడం పై చాలా బాధపడుతున్నా
-యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని వైసీపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా రాజీనామా చేశారు. తనకు హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం లాంటి కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గౌరవించారని, అయితే ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై తాను చాలా బాధపడుతున్నట్లు తెలిపారు.
వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు. కానీ ఎన్‌టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో సహాయం కోసం తాను వైఎస్సార్ దగ్గరకు వెళ్తే సహాయం చేశారన్నారు. ఆ కేసులో తనపై ఒత్తిడి వచ్చినా వైఎస్సార్ లొంగలేదని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయుడు పై, తనది సైద్ధాంతిక విరోధమే తప్ప వేరే ఏమీ లేదని స్పష్టం చేశారు.