Suryaa.co.in

National

నా చావే ప్రధాని మోదీకి పుట్టినరోజు కానుక

-సంచలనంగా మారిన రైతు ఆత్మహత్య లేఖ
-కంటతడి పెట్టిస్తోన్న ఉల్లిరైతు దశరథ్ మరణవాంగ్మూలం

‘నేను, దశరథ లక్ష్మణ్ కేదారి. ఓ సాధారణ రైతును. ప్రభుత్వం ఉల్లి పంటకు సరైన ధర ఇవ్వడం లేదు. టమోటాలకూ ధర లేదు. అంతకుముందు కరోనా విలయం వల్ల నష్టపోయిన మేము.. భారీ వర్షాలకు ఇంకాస్త దెబ్బతిన్నాం.

చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది.అప్పుల వాళ్ల వేధింపులు పెరిగాయి.ఎలాగోలా పంటను పండించినా, దాన్ని మార్కెట్ కు తరలించే స్తోమత కూడా లేదుమాకు. ఈ అనుభవాలన్నీ నాకు జీవితంపై విరక్తిని పెంచాయి. రైతుకు బతుకే లేదని అర్థమైంది.

మోదీ గారూ.. నా మరణవాగ్మూలం వినండి.. రైతులమైన మేము బిచ్చగాళ్లం కాదని గుర్తించండి. మాకు గిట్టుబాటు ధర కల్పించండి.అయ్యా మోదీ సారూ.. మా రైతుల జీవితం జూదం కాదండి. మార్కెట్ లో మా పంటలకు సరైన న్యాయం కావాలండి.

రైతుల గోస తెలియజెప్పాలనే ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజునాడు ఆయనకు కానుకగా నేను ప్రాణర్పణ చేస్తున్నాను’’అని దశరథ్ లక్ష్మణ్ కేదారి తన సూసైడ్ నోట్ లో రాశాడు.మహారాష్ట్ర రైతు దశరథ్ ఆత్మహత్యోదంతం దేశవ్యాప్తంగా రైతులను కలవరపాటుకు గురిచేసింది.

దశరథ్ లాగా ఎవరూ కుంగిపోవద్దని రైతు సంఘాల నేతలు విన్నవిస్తున్నారు.రైతు సోదరులు తమ పరిస్థితి గురించి నిరాశ చెందవద్దు. జీవితం చాలా విలువైనదని, భార్యాపిల్లల గురించైనా రైతులు బతుకుపోరాటం చేయాల్సిందే. బతికుండి పోరాటం చేస్తేనే రైతుల సమస్యలు తీరుతాయి. రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దెదించడంలో మనమంతా కలిసికట్టుగా ముందుకెళ్లాలి.మోదీకి పుట్టినరోజు కానుకగా ప్రాణార్పణ చేసిన రైతు దశరథ్ కేదారికి హృదయపూర్వక నివాళి.

LEAVE A RESPONSE