ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తెలుగు జాతికే అవమానం

-ఎన్టీఆర్ పేరును కొనసాగించకపోతే ప్రజలు మీకు చరమగీతం పాడతారు
– ఎన్.ఆర్.ఐ. టీడీపీ సౌతాఫ్రికా అధ్యక్షుడు పారా రామకృష్ణ

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరుతో మార్చాలనుకోవడం ఆంధ్ర రాష్ట్రానికే కాదు తెలుగు జాతికే అవమానకరం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవడం సిగ్గుచేటు. ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.

వైద్య విద్యార్థులకు ప్రత్యేక వర్సిటీ లేని సమయంలో వైద్య విద్యలో నాణ్యత పెంచి, పర్యవేక్షణ, నియంత్రణ సాధించేందుకు ఒక స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థ ఉండాలని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరుతో యూనివర్సిటీని ప్రారంభించారు. ఆ తరువాత ఎన్టీఆర్ చొరవతో ఏర్పడిన యూనివర్సిటీ కావడంతో ఎన్టీఆర్ పేరును 1998 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని ప్రతిపాదించారు.

ఆ తరువాత వరుసగా వచ్చిన ముఖ్యమంత్రులు ఇటువంటి ఆలోచన చేయలేదు. చివరకు రాజశేఖర్‌ రెడ్డి కూడా తన హయాంలో ఎప్పుడూ వర్సిటీ కార్యకలాపాల్లో వేలు పెట్టలేదు. పార్టీలకు అతీతంగా పాతతరం ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అప్పట్లో ఎన్టీఆర్‌కు అంత గౌరవం ఇచ్చారు. వైఎస్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కడప జిల్లాలోని హార్టీకల్చర్‌ యూనివర్సిటీకి డా.వైఎ్‌సఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీగా నామకరణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఈ పేరునే కొనసాగించింది. తాను పాలించిన ఐదేళ్ల కాలంలో ఎన్నడూ వైఎస్‌ పేరు తొలగించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. ఎన్టీఆర్ కు అభిమానులమని చెప్పుకుని రాజకీయ లబ్ది పొందుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, లక్ష్మీపార్వతీ, తమ్మినేని సీతారాం వంటి వాళ్లకు ఇదో చెంప పెట్టు. మరో సారి ఎన్టీఆర్ పేరును సైతం మీ లాంటి నాయకుల నోట వెంట ఉచ్చరించే అర్హత కోల్పోయారు.

వైఎస్ చావుకు కారణమైన వాళ్లని ఆరోపించిన వాళ్లకే పదవులు కట్టబెట్టావు, తల్లిని గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించావు. చెల్లిని రోడ్డుపై నెట్టావు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని జగన్ రెడ్డి భావించడం అమయకత్వమే అవుతుంది. నీ రాజకీయ దుర్భిద్ది ప్రజలకు ఇప్పటికే అర్ధమైంది. కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీగా పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.