Suryaa.co.in

Telangana

ఎన్నికల కోడ్ రాకముందే యాత్ర పూర్తి

– 370 సీట్లకు పైగా గెలవడమే లక్ష్యం
– బీఆర్ఎస్ తో పొత్తు అనేది మూర్ఖులు చేస్తున్న ప్రచారం
– రేపటి నుంచి ప్రారంభం కాబోయే విజయ సంకల్ప యాత్ర కు సంబంధించిన పోస్టర్, పాటలను విడుదల చేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
– కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి
– జనసందేశ్ డిజిటల్ పత్రికను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు (ఫిబ్రవరి 20న) ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 విభాగాలుగా జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది.

రేపటి నుండి 4 యాత్రలు కొనసాగుతాయి.

1) కొమరంభీం విజయ సంకల్ప యాత్ర
బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుండి ప్రారంభమవుతుంది.
ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్లలో కొమరంభీం విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు జరుగుతుంది. 21 నియోజకవర్గాలల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.

2) రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర
కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. మిగిలిన నియోజకవర్గాలను కూడా కవర్ చేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నాం.
3) భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులుతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్లలో ఈ యాత్ర సాగుతుంది.
4) కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర
సమ్మక్క సారక్క జాతర కారణంగా రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లలో 1,015 కి.మీ,7 రోజులు.. 21 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.
5) కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర
మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్లలో ఈ యాత్ర ఉంటుంది.
21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,440 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.
ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే విజయసంకల్ప యాత్రకు పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బాసర నుండి ప్రారంభమయ్యే కొమరం భీం విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ లో ప్రారంభమయ్యే రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ప్రారంభిస్తారు.
యాదాద్రి టెంపుల్ నుండి ప్రారంభమయ్యే భాగ్యనగర విజయ సంకల్ప యాత్రను గోవా ముఖ్యమంత్రి డా. ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు.
కృష్ణా గ్రామంలో ప్రారంభమయ్యే కృష్ణా విజయ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారు.

ఈ యాత్రలు సభలు మాత్రమే కాకుండా రైతులు, చేతి వృత్తులకు, నిరుద్యోగలు, పొదుపు సంఘాల వారితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ రోడ్ షోల ద్వారా ముందుకు వెళ్తుంది. బహిరంగ సభలు ఎక్కడా ఉండవు. అన్ని యాత్రలలో రోడ్ షోలు మాత్రమే. 5 యాత్రలు 5,500 కి.మీ ఉంటుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు. 119 నియోజకవర్గాలలలో 114 నియోజకవర్గాలలో యాత్ర వెళ్తుంది. మొత్తం 5 యాత్రలల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ ఉంటాయి. మార్చి 2వ తేదీ వరకు యాత్రలు పూర్తవుతాయి.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన దేశంలో జరిగిన అభివృధ్ది, సంక్షేమ పథకాలు, సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు, దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తాము.

వచ్చే పార్లమెంటు ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు. ఎవరు ప్రధానిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందో నిర్ణయించే ఎన్నికలు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తం. గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అవినీతి, కుంభకోణాలను ప్రజలకు వివరిస్తం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలు…అవినీతి పార్టీలు, ప్రజలను మోసం చేసిన పార్టీలు.

తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నీతివంతమైన, అవినీతి రహిత పాలనను ప్రధాని నరేంద్రమోదీ అందించారు. దేశ ప్రజలు నరేంద్రమోదీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టేందుకు విజయ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నాం. ఎన్నికల కోడ్ రాకముందే యాత్రను పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నాం.

నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తం. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందుతున్న వారందరిని కలుస్తాం. ప్రతీ రైతు ఎరువుల మీద ఎకరానికి 20వేల లభ్ధి పొందుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా ప్రజలకు వివరిస్తాం. నరేంద్ర మోదీ పాలనలో ఉగ్రవాదాన్ని అణచివేశారు. దేశంలోని 543 పార్లమెంటు స్థానాల్లో 370 సీట్లకు పైగా గెలవడమే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మెజారిటీ స్థానాలు గెలవడమే లక్ష్యం.

ఇండియా కూటమి టెంట్లు కూలిపోతున్నాయి. కూటమి బద్దలైంది. దేశ ప్రజలంతా ఏకమై నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం అన్ని యాత్రలలో పాల్గొంటారు. ఈ యాత్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో…కమలం పువ్వు జండా కింద జరుతున్న యాత్ర. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో దూసుకెళ్తుంది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది.

ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిర నిర్మాణం, పేద ప్రజలకు 5కేజీల బియ్యం… అనేక నిర్ణయాలతో భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల కంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మద్దతు ఉంది. తెలంగాణలో 17కు 17సీట్లు గెలవడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నాం. మెజారిటీ సీట్లలో విజయం సాధిస్తాం. మధ్య మధ్యలో ఇతర జాతీయ నాయకులు కూడా యాత్రలో పాల్గొంటారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రథాలకు పూజలు చేశాం.

బీఆర్ఎస్ తో పొత్తు అనేది మూర్ఖులు చేస్తున్న ప్రచారం. 17 సీట్లలో సింగిల్ గా పోటీ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవ. బీఆర్ఎస్ పార్టీతో ఏరోజు కూడా పొత్తు పెట్టుకోలేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఇలానే ప్రచారం చేసిర్రు. ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం కలిగిన పార్టీ..

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెరవెనుక కలిసే పార్టీలు. గతంలో కూడా అధికారాన్ని పంచుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేశాయి. ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నా. గ్రామస్థాయిలో, పోలింగ్ బూత్ లో 25 మందిని పార్టీలో చేర్చుకుంటాం.

2018 ఎన్నికల్లో అనేక స్థానాల్లో మా ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్లు రాలే. ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారు కాబట్టే 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాం.

LEAVE A RESPONSE