Suryaa.co.in

Political News

బాబూ..పవన్ ఆలోచించండి!

– చంద్ర బాబు, పవన్ కల్యాణ్ కు బహిరంగ విజ్ఞప్తి

ఉమ్మడి మద్రాస్ ప్రోవిన్స్ నుండి విడబడిన 1953 సం. లగాయతు, 2024 వరకు ఆంధ్ర ప్రాంతం అనేక రకాల దగాలకు గురైనది. ఎన్నెన్నో ఆశలు కల్పించి విశాలాంధ్ర నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించిన ప్పటికి, అనేక ఆటు పోట్లతో … పాలకులు అధిక శాతం ఆంధ్ర వారై నప్పటికీ , అభివృద్ధి హైదరాబాద్ లో జరిగి పోయింది.

అక్కడి విభజన వాద ఉద్యమానికి పరిష్కారంగా, ఆంధ్ర ప్రదేశ్ విభజనకు ప్రధాన కారకులు కాంగ్రెస్ ,బిజెపి వారు. ఒకరు రాష్ట్రాన్ని విభజించగా , దానికి మద్దతు ఇచ్చిన మరొకరు అధికారానికి వచ్చి , విభజన హామీలను నిర్లజ్జగా తుంగలో తొక్కారు. జాతీయ స్ఫూర్తి అనేది వారిలో మచ్చుకైనా లేదు. ఈ రెండు పార్టీల ను ఈనాడు ఆంధ్ర ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు.

అంతే కాదు కేరళ , తమిళనాడు,కర్ణాటక , తెలంగాణ లలో బిజెపి కి స్థానాలు దాదాపు శూన్యం. అత్యల్పం. ఇక ఒరిస్సా ,బెంగాల్ , పంజాబ్ , కాశ్మీర్ వంటి రాష్ట్రాల లో వారికి ఏ మాత్రం ప్రజాదరణ లేదు. బిజెపి కి 300 – 400 సీట్లు వస్తాయనే దగా కోరు ప్రచారాలకు మీరు కొట్టుకు పోవద్దు.

అయితే కేంద్ర సహాయం అనే కారణంతో బిజెపితో పొత్తుకు వెళుతున్న మీకు ఓ విజ్ఞప్తి..
మీకు అంటే.. టీ డీ పీ- జన సేన లకు ప్రజాదరణ సంపూర్ణముగా ఉంది. ఎంత అంటే.. ఇరవై అయిదు ఎంపీ సీట్లు గెలిచేటంత. మీరుభయులు కలసి 25 ఎం పి సీట్లు గెలిచి, అప్పుడు బి జే పి కి మద్దతు ఇవ్వండి.. అభ్యంతరం లేదు.

ఇపుడు అడిగినన్ని సీట్లు బిజెపి కి ఇచ్చి , ప్రజలను దగా చేసి ,ఆ తరువాత మీరు దగా పడతానంటే, ప్రజానీకం ఆమోదించదు. ఇక బిజెపి వారి గౌరవం నిలపాలంటే, రెండు ఎంపీ సీట్లు మించి, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇవ్వవద్దని మనవి.

మలయాళీలు లా , తమిళుల లా , కన్నడిగు ల లా ,ఆఖరుకు తెలంగాణా సోదరుల లా ,సొంత అస్తిత్వం కోసం తలెత్తుకొని బి జే పి వారితో మాట్లాడండి. మాట తప్పి ,మడమ తిప్పి తల వంచాల్సిన పరిస్థితి టి డీ పీ- జన సేన లకు లేదని ఉ ఉత్తరాది పెత్తందార్ల కు సగౌరవంగా , నిర్భయంగా చెప్పండి. ఆంధ్ర ఎంపీ ల విలువ.. రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక మీకు -ప్రపంచానికి తెలుస్తుంది. దయ చేసి ఆంధ్రుల ఆత్మ గౌరవం ను నిలబెట్టండి

నేను రాజకీయ వాదిని కాను. ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి కావాలని ,అమరావతి ఒకే ఒక రాజధాని అడ్రస్ గా పురోగతి చెందాలని నా జీవిత ఆకాంక్ష,

– జి వి రామ్ ప్రసాద్
విజయవాడ.
628 1114344.

LEAVE A RESPONSE