నెరవేర్చిన హామీలే మా ధైర్యం
ఎంపీ విజయసాయిరెడ్డి
నవంబర్ 16, ప్రజలతోనే వైకాపా పొత్తు, నెరవేర్చిన హామీలే ధైర్యం, జనమే తమ నమ్మకం అన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు దూసుకుపోతున్నారని, ప్రజలపై నమ్మకం లేని విపక్ష పార్టీలు పొత్తులతో ప్రజానేత సీఎం జగన్ ను ఢీ కొట్టాలని చూస్తున్నాయని, ప్రజాబలం మందు ఏ పొత్తులైనా చిత్తు కాక తప్పదని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గురువారం ఈ అంశంపై స్పందించారు.
వెన్నుపోటుదారుడికి అండగా పురందేశ్వరి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను గౌరవించి జిల్లాకు ఆయన పేరు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకొని తన తండ్రిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును శిక్ష పడకుండా పురందేశ్వరి పడుతున్న తాపత్రయం చూసి భగవంతుడు కూడా ఆమెను క్షమించడని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం పురందేశ్వరి చేస్తున్న విన్యాసాలు వర్ణించలేనివని అన్నారు.