-వైసీపీ హత్యా రాజకీయాలను ఇక సహించం
-ఇప్పటి నుంచి మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయి
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
పల్నాడులో వైసీపీ హత్యారాజకీయాలు రోజు రోజుకీ పేట్రేగిపోతున్నాయి. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రయ్య ఉంటే గుండ్లపాడులో వైసీపీకి మనుగడ ఉండదని భావించి దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాల్ని పెంచిపోషిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయి. రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారు. ఇక నుంచి వైసీపీ వైసీపీ అరాచకాల్ని సహించేది లేదు, నేటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయి. చంద్రయ్య కుటుంబానికి 60 లక్షల టీడీపీ కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారు. చంద్రయ్యను హత్య చేసిన వారిని, హత్య చేయించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలి.