Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల నియమావళిని వైసీపీ యదేచ్చగా ఉల్లంఘించింది

– అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు
– ఎల్.వి సుబ్రమణ్యం పైతం గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై లేఖరాశారు.
– గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందంటూ భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసిన తెదేపా నేత వర్ల రామయ్య

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఎన్నికల నియమావళిని యదేచ్చగా ఉల్లంఘించింది. కొంతమంది ఎన్నికల అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు. ఓట్లు నమోదు అధికారులు, గజిటెడ్ అధికారులు ఫేక్ సర్టిఫికేట్లను అంగీకరించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. బోగస్ ఓట్లపై సరైన విచారణ చేయలేదు. గ్రాడ్యుయేట్లు కాని వారిని ఓటర్ల జాబితాలో చేర్చారు.ఒక్కొక్క గృహంలోనే దాదాపు 30 మంది గ్రాడ్యుయేట్ లకు పైగా ఓటర్లను లిస్ట్ లో చేర్చారు. వైసీపీ పార్టీ ఆఫీసు పేరుతో మూడు డజన్ల ఫేక్ గ్రాడ్యుయేట్ ఓట్లను చేర్చారు. ఒక్కో ఓటర్ కు రూ.1000 పంచమని సాక్షాత్తు రాష్ట్ర శిశు, మహిళా సంక్షేమశాఖా మంత్రి ఉషశ్రీ చరణ్ అధికారులను, వైసీపీ కార్యకర్తలను ఆదేశిస్తున్న వీడియో బయటకు వచ్చింది.ఎన్నికల ప్రచారం ముగిసినప్పట్టికీ వైసీపీ ఎంపీ మితున్ రెడ్డి కడప జిల్లా తంబళ్లపల్లెలో ర్యాలీ చేపట్టి ఓటర్లను ప్రభావితం చేశాడు.విశాఖపట్నం లో వార్డు నెం 16 లో వైసీపీ మద్దతుదారుడు ఈశ్వర్ రావు ఓటర్లకు నగదు పంపిణీ చేశాడు.

తిరుపతి టౌన్ బూత్ నం.223 లో 9 వ తరగతి చదివిన విజయ అనే మహిళా దొంగఓటు వేయడానికి వచ్చింది.ప్రొద్దుటూరులో పోలింగ్ బూతు నం. 62, 63, 64 లలో సైతం వైసీపీ మద్దతుదారులు ఓటర్లకు నగదు పంపిణీ చేశారు.దొంగ ఓట్లు వేసుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి లు టిడిపి నేత మబ్బు దేవనారాయణ రెడ్డిని పోలీసులతో అక్రమ అరెస్టు చేయించారు. ఒంగోలులో పోలింగ్ బూతుల వద్ద ఏర్పాటు చేసుకున్న టిడిపి టెంట్లను బలవంతంగా తొలగించారు. విశాఖపట్నం 53 వ వార్డులో బర్కత్ అలి అనే వ్యక్తి డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు.ఉప ముఖ్యమంత్రి బుడి ముత్యాలనాయుడు పోలింగ్ కి 48 గంటలు ఉందనగా వైసీపీ జెండాలను ఎగురవేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. బోగస్ ఓటర్లను అడ్డుకున్నందుకు తిరుపతిలో టిడిపి నేత నరసింహయాదవ్ ను అక్రమ అరెస్టు చేశారు.పత్తికొండ అసెంబ్లీలో వైసీపీ మద్దతుదారులు డబ్బులు పంచుతూ కెమెరాలకు పట్టుబడ్డారు.మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానాల్లోని పోలింగ్ బూత్ లను ఆక్రమించుకుని రిగ్గింగ్ కు పాల్పడ్డారు.

తిరుపతి అసెంబ్లీలో అనేక మంది అర్హత లేని ఆటో డ్రైవర్లు దొంగ ఓట్లు వేశారు. తిరుపతి టౌన్ లో టిడిపి నేత పులిగోరు మురళి, పోలింగ్ ఏజెంట్ మరొక మురళిని అక్రమ అరెస్టులు చేశారు. తంబళ్లపల్లె లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేసుకున్నారు. దీనిపై పిర్యాదు చేసిన స్వతంత్ర అభ్యర్ది అంకయ్య చౌదరిపై దాడి చేశారు.అనేక మంది మేధావులతో సహా మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్.వి సుబ్రమణ్యం పైతం గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై లేఖరాశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై సంబంధిత అధికారులకు టిడిపి అనేకమార్లు పిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.తిరుపతిలోని ఒక్క చిన్న బడ్డీకొట్టు అడ్రస్ తో 16 మంది గ్రాడ్యేయేట్ ఓటర్లు నమోదు చేశారంటే ఎంత పెద్దస్థాయిలో ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

బోగస్ ఓటర్ల జాబితాపై గ్రాడ్యేయేట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధి కంచెర్ల శ్రీకాంత్ అనేక పిర్యాదులు చేసినప్పటికీ స్థానిక పోలీసు అధికారుల పైఅధికారుల అనుమతి లేనిదే కేసులు నమోదు చేయడం లేదు.బోగస్ ఓట్లపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి ఎన్ని పిర్యాదులు చేసినప్పటికీ చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారపార్టీతో కుమ్మక్కుతో గ్రాడ్యుయేట్ ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేయించండి. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఎన్నికల పక్రియకు కస్టోడియన్ అయిన తమరు తగు చర్యలు తీసుకోగలరు. రాబోయే ఎన్నికల్లోనైనా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించగలరు.

LEAVE A RESPONSE