– అఖిలేష్‌కు జగన్ ఆర్ధిక సాయం
– బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకాదినకర్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి వైసీపీ దొంగదారుల్లో అఖిలేష్‌యాదవ్‌కు సాయం చేసిందని బీజేపీ లంకాదినకర్ ఆరోపించారు. ఈ విషయాన్ని తమ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బయటపెట్టినా, ఇప్పటివరకూ వైసీపీ స్పందించకుండా తేలుకుట్టిన దొంగలా ఉండిపోయిందని విమర్శించారు.
యుపి లో బీజేపీని ఓడించడానికి అఖిలేష్ యాదవ్ కి అవినీతి సొమ్ము పెద్ద ఏత్తున ఏపీ పాలకుల నుండి వెళ్లింది.నిఘా వర్గాలు నిగ్గు తేల్చిన అనంతరం వాస్తవాలు బహిర్గతం చేస్తాము. ఏపీ లోని వైయస్సార్సీపీ నాయకుల ప్రోద్భలంతో తయారయ్యే మద్యం, అఖిలేష్ యాదవ్ సహకారంతో యూపీ లో తాము అనుకున్న ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అమ్మలనే ప్రణాళిక పారలేదు.
మన ఏపీ నుండి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యుపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు.సత్యకుమార్ ” ఏపీ అవినీతి సొమ్ము యుపి ఏన్నికలలో బీజేపీ కి వ్యతిరేకంగా వాడారు ” అని చెప్పిన అనంతరం, తేలు కుట్టిన పిల్లి లాగా వైయస్సార్సీపీ నాయకులు నిశబ్దంగా ఉన్నారు.
బీజేపీ కి వ్యతిరేకంగా అవినీతి సొమ్ము వాడిన వీరి బాగోతం బట్ట బయలు అయ్యింది, అవినీతి పరుల కూటమి కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారు.బీజేపీ కి వ్యతిరేక ఫ్రంట్ కోసం అఖిలేష్ వద్ద టెంట్ వేద్దామని వైయస్సార్సీపీ అడ్వాన్స్ రెంట్ కట్టి విఫలమయ్యింది.