Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో వైసీపి రాక్షస పాలన కొనసాగుతుంది

– త్వరలో రాష్ట్ర ప్రజానీకం ఈ ప్రభుత్వానికి చరమగీతం
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

గొల్లపూడి : గురువారం మధ్యాహ్నం గొల్లపూడి వన్ సెంటర్ నందు కూల్చివేసిన తెదేపా కార్యాలయ ప్రదేశాన్ని పరిశీలించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య . మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుని వారి స్వగృహంలో కలిసిన అనంతరం మాట్లాడుతూ….రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి వైసిపి పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలయ్యాయి. కుటుంబ కలహాలలో ఉన్న స్థల వివాదంలో అది కోర్టు విచారణ జరుగుతుండగా అధికారుల రంగ ప్రవేశం ఏంటి?

స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు ఆ స్థలానికి సంబంధించిన కుటుంబ వ్యక్తులను లోపాయికారికంగా భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయం.రంగుల పైశాచిక పిచ్చితో స్థానిక అధికార పార్టీ నేతలు వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర భజన కార్యక్రమం మొదలుపెట్టారు.కోర్టు విచారణలో ఉన్న అంశంపై అధికారుల అత్యుత్సాహ చొరవ వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది?

ఈరోజు అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.నిన్న,మొన్న కూడా చూశాము కోర్టు ధిక్కరణ కేసులో అధికారులకు నెల రోజులు జైలు శిక్ష విధించడం.చంద్రబాబు నాయుడు రోడ్డు షోలకు, బహిరంగ సభలకు వస్తున్న ప్రజాదరణ చూస్తేనే తెలిసిపోతుంది వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే

LEAVE A RESPONSE