Suryaa.co.in

Andhra Pradesh

సలహాదారుల నియామకం ప్రమాదకరం: ఏపీ హైకోర్టు

అమరావతి: ప్రభుత్వ సలహాదారులపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్‌ నియామకం, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌ నియామకంపైనా కలిపి హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తుది నిర్ణయానికి ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ప్రశ్నించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది.

LEAVE A RESPONSE