Suryaa.co.in

Andhra Pradesh

ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదు.. విశాఖలో భూములు కాజేసేందుకు వైకాపా నాటకాలు

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని స్థితికి కారణం వైకాపా పాలకులు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నారు.వైకాపాకు ప్రాంతాల, కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందటం అలవాటేనని విమర్శలు చేశారు.ఆంధ్రప్రదేశ్కు ఆయువుపట్టు అమరావతి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలోని కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్నారు.రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే.. పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి కారణం వైకాపా పాలకులేనని ఎద్దేవా చేశారు.

అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండాలని అమరావతిని ఎంపిక చేసుకున్నామని,.. శాసనసభలో అన్నిపార్టీల అంగీకారంతోనే అమరావతిని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.నాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అంగీకరించి.. అక్కడే ఇల్లు కట్టుకుంటామని చెప్పలేదా అని ప్రశ్నించారు.

జగన్కు, వైకాపాకు మొదటినుంచి ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందడం అలవాటే విమర్శించారు. ఈ రోజు మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.రైతులు పాదయాత్ర చేస్తుంటే.. కొంతమంది మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

వారు ఉత్తరాంధ్ర పైన ప్రేమతో మాట్లాడటం లేదని,.. విశాఖలో ఉన్న భూములు కాజేయడానికి,.. చివరికి ప్రకృతి ఇచ్చిన రుషికొండను సైతం దోచుకోవడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని అన్నారు.

LEAVE A RESPONSE