Suryaa.co.in

Andhra Pradesh

మైనార్టీలను దగా చేసిన వైసిపి ప్రభుత్వం

  • 2014-2019లో మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట
  • 2019-2024లో మైనార్టీ పథకాలను నిర్వీర్యం చేసిన జగన్
  • మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు
  • ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్

అమరావతి ఆగస్టు 6 రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో మైనార్టీల సంక్షేమం కు తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు.2014-2019 టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. స్వర్ణయుగంలా టిడిపి ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం సాగిందని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం టిడిపి చేపట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేసి నిర్వీర్యం చేయడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో2011 జనాభా లెక్కల ప్రకారం 43.46 లక్షల మంది మైనార్టీలు ఉన్నారని అన్నారు. ఇందులో ముస్లింలు 36.18 లక్షలు, క్రిస్టియన్ లో 6.83 లక్షలు, సిక్కులు 0.10 లక్షలు, బుద్ధిస్టులు 0.04 లక్షలు, జైనులు 0.27 లక్షలు, పార్సీలు 0.04 లక్షలు ఉన్నారని అన్నారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం,సిఎస్ఎస్ కింద 60:40 భాగస్వామ్యంలో భాగంగా రూ. 447.06 కోట్లు మంజూరు కాగా,రూ. 93.67 కోట్లతో 77 ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో 10 జూనియర్ కళాశాలలు, 9 ఐటిఐ కళాశాలలు, 5 పాలిటెక్నిక్ కళాశాలలు, 18 రెసిడెన్షియల్ పాఠశాలలు, 35 హాస్టలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో 16 ప్రాజెక్టులు పూర్తయ్యాయని,13 నిర్మాణంలో ఉన్నాయని 43 ప్రారంభం కాలేదు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ పనుల పూర్తిని గాలికి వదిలేసి,పనులన్నింటినీ నిలిపి వేశారని ద్వజమెత్తారు.

విజయవాడలో రూ.80 కోట్లతో టిడిపి ప్రభుత్వం హజ్ భవనాన్ని మంజూరు చేస్తే వైసిపి ప్రభుత్వం హజ్ భవన నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదనివిమర్శించారు

ఉర్దూ భవనాలు, షాది ఖానాల నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం 342 ప్రాజెక్టులు మంజూరు చేశామని, 196 పూర్తయ్యాయని,146 ప్రారంభం కాలేదని,రూ. 83.15 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వైసిపి ప్రభుత్వం కేవలం 46 ప్రాజెక్ట్లను మంజూరు చేసి, 2 ను మాత్రమే పూర్తి చేయడం మైనారిటీల పట్ల ఆ పార్టీకి ఉన్న వైఖరి స్పష్టం అవుతుందని అన్నారు.

కడపలో హజ్ భవనం నిర్మాణం కోసం రూ. 24 కోట్లు మంజూరు చేసామని,రూ. 15 కోట్లతో 80 శాతం పనులు పూర్తి అయినప్పటికీ, టిడిపి ప్రభుత్వం చేపట్టిందన్న ఒకే ఒక కారణంతో సీఎంగా తన సొంత జిల్లా కేంద్రంలో జగన్ హజ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం సైకో పాలనకు అద్దం పట్టిందని విమర్శించారు.

గుంటూరులో క్రిస్టియన్ భవనం నిర్మాణం కోసం రూ. 16 కోట్లు మంజూరు చేసి,రూ. 10 కోట్లతో 50% పనులు టిడిపి ప్రభుత్వం పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా నిలిపివేసిందని అన్నారు.

రాష్ట్రంలో 648 వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ. 57.58 కోట్లతో పనులు చేపట్టి 60 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, మూడు షాపింగ్ కాంప్లెక్స్ లను రూ. 1.65 కోట్లతో చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ స్కీంల పనులన్నింటినీ వైసిపి ప్రభుత్వం పూర్తిగా డిస్కంటిన్యూ చేసిందని ఫరూక్ విమర్శించారు.

రాష్ట్రంలో గ్రాంట్ రూపంలో 2014 -2019 కాలంలో 977 చర్చిల నిర్మాణానికి రూ. 70.36 కోట్లు నిధులు మంజూరు చేసి,377 పనులు పూర్తి చేయడం జరిగిందని ఇందుకోసం రూ. 56.55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మిగిలిన పనులను చేపట్టకుండా వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసి మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు.

మైనార్టీలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రాయితీతో కూడిన వివిధ స్కీములను టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టి 48892 మంది లబ్ధిదారులకు రూ.278.44 కోట్ల లబ్ధి చేకూర్చడం జరిగిందని, మైనార్టీలకు శిక్షణ ఉపాధి కల్పన కింద 41088 మందిలబ్ధిదారులకు రూ.53.89 కోట్లు ఖర్చు చేశామని, ప్లేస్మెంట్ లింక్డ్ కింద క్రిస్టియన్ మైనార్టీలకు స్వయం ఉపాధి శిక్షణకు 2814 మంది లబ్ధిదారులకు రూ.0.95 కోట్లు టీడీపీ ప్రభుత్వం 2014-2019 లో ఖర్చు చేయగా,ఈ స్కీములన్నింటినీ కూడా దుర్మార్గపు వైసిపి ప్రభుత్వం డిస్కంటిన్యూ చేసిందని అన్నారు.

రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో, సైకో జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోనే మైనార్టీ లందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, మైనార్టీ సంక్షేమ పథకాలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం, అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు అమలు కోసం వడివడిగా టిడిపి -జనసేన -బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE