– రాష్ట్ర ప్రభుత్వం వాడుకొన్న కేంద్ర ప్రభుత్వం నిధులను వెంటనే గ్రామ పంచాయతీలకు జమ చేయాలి
– గ్రామ పంచాయతీ సర్పంచ్ ల నిధులు,విధులు కోసం సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఉద్యమం
– పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వి బి రాజేంద్ర ప్రసాద్
– ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచ్ ల సదస్సు తీర్మానం
నెల్లూరు లోని మినర్వా గ్రాండ్ హోటల్ లో ఈరోజు జిల్లా సర్పంచ్ సంఘం కన్వీనర్ శివకుమార్ అధ్యక్షతన సర్పంచ్ ల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వి బి రాజేంద్ర ప్రసాద్,రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి,సుబ్బరామయ్య,సర్పంచ్ సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వి బి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది వైసీపీ కి చెందిన వారే సర్పంచ్ లు గా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్పంచ్ లకు నిధుల,విధులు లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన ఎస్ ఎఫ్ సి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.8600 కోట్లు ను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకొని గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది.
గ్రామ సచివాలయం వ్యవస్థ,వాలింటర్ వ్యవస్థను తెచ్చి సర్పంచ్ లు అధికారాలను వారికి అప్పగించి,సర్పంచ్ లకు విధులు లేకుండా చేసింది. సర్పంచ్ ల నిధులు,విధులు కోసం పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు అందరూ ఏకమై పోరాటం చేయ బోతున్నారు. ఈ నాటి సర్పంచ్ ల సమావేశానికి అధికార పార్టీ సర్పంచ్ లు కూడా హాజరై పోరాటంలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతుంది.
రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచ్ ల సంఘ ఆధ్వర్యంలో సర్పంచ్ ల హక్కులు, నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేంత వరకూ దశల వారీగా పోరాటం చేయడం జరుగుతుంది అని అన్నారు. అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్ లు హాజరైన ఈ సమావేశంలో 13 తీర్మానాలను ఆమోదించడం జరిగింది.