Suryaa.co.in

Andhra Pradesh

ఓటమి భయంతో బరితెగించి ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోన్న వైసీపీ

– నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం
ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపిటీసీ, జెడ్.పి.టీసి ఎన్నికలు ఒక పార్స్ గా మారాయి. 2014 ఎంపిటీసీ ఎన్నికల్లో 16,589 స్థానాలకు 346 ఏకగ్రీవాలు అయ్యాయి. అదే 2020 లో 9,696 స్థానాలకు 2,362 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. అంటే 2014 లో 2 శాతం అయితే 2020 లో 24 శాతం అయ్యాయి. అనగా 12 రెట్లు అధికం అన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2019 లో ఒక్క జెడ్.పి.టీ.సి స్థానం ఏకగ్రీవం అయ్యింది. అంటే 0.09 శాతం. అలాంటిది 2020 లో 652 స్థానాలకు 126 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. అంటే 19 శాతం.
బలవంతపు ఏకగ్రీవాలు
నియోజకవర్గం మొత్తం పంచాయతీలు ఏకగ్రీవాలు
పుంగనూరు (చిత్తూరు) 85 85
మాచర్ల (గుంటూరు) 77 74
పూతలపట్టు (చిత్తూరు) 152 46
తంబల్లపల్లి (చిత్తూరు) 102 30
శ్రీకాళహస్తి (చిత్తూరు) 121 71
చంద్రగిరి (చిత్తూరు) 72 34
పులివెందుల (కడప) 108 90
బనగానపల్లి (కర్నూలు) 102 46
8 నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలు : 476
ఈ బలవంతపు ఏకగ్రీవాలకు జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు సమాధానం చెప్పగలరా? బలవంతపు ఏకగ్రావాలతో నష్టపోయిన వారు కోర్టుకు వెళ్లుంటే వైసీపీ నేతలు జైలుకు పోయేవారు. తిరుపతి 7 వడివిజన్ తెదేపా అభ్యర్ధి విజయలక్ష్మి, ఆమె భర్త నామినేషన్ వేసిన తర్వాత బలవంతంగా తీసేశారు. వారు ఎంత బ్రతిమిలాడుకున్నా లెక్కచేయలేదు. దాంతో ఆయన కోర్టుకు వెళ్లాడు, కోర్టులో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు………నామినేషన్ ఉపసంహరణ పత్రంలో చేసిన సంతకాలు పోర్జరీ అని తేల్చారు. స్టీరియో మైక్రోస్కోప్, వీడియో స్పెక్టరల్ కంపారిటర్స్ మాగ్నిఫయర్స్ టెక్నాలజీతో సంతకాలను పోల్చి చూసి పోర్జరీ అని తేల్చారు. ఎఫ్.ఎస్.ఎల్ లో కూడా చాలా క్లియర్ గా పోర్జరీ అని చెప్పారు.
ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఈయన నేరాలు చేయడంలో దిట్ట. అందుకే లక్షకోట్ల రూపాయలు కొట్టేసి ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. ఈయనపై 6 ఈడీ, 11 సిబిఐ ఛార్జిషీట్లు ఉన్నాయి. ఇప్పుడు తన అవినీతిని గవర్నమెంటులో మాస్టరైజ్ చేస్తున్నాడు. దీనికి పోర్జీరి సంతకాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఎటువంటి సందేహం లేకుండా ఇది పోర్జరీ అని నిరూపితమైంది. ఈ ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత ఉందా? ఈయనకు ఏమాత్రం సిగ్గు, యగ్గు ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలి. ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని చెబితే వాళ్లపై దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, వారి బంధువులను హింసించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం చేస్తున్నారు. పోర్జరీ సంతకాలతో నామినేషన్లను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారిని వెంటనే అరెస్టు చేయాలి. హీ మస్ట్ బి సాక్డ్. ఈయనకు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్.ఓ) గా కొనసాగే హక్కు లేదు.
తిరుపతి 7 వడివిజన్ తెదేపా అభ్యర్ధి ఎం. విజయలక్ష్మి భర్త….పెరుమాళ్ల మధుబాబు
“ మీరు చేసిన తప్పుకు వాడెవడో చెప్పాడని నాకు అన్యాయం చేస్తే….ఈరోజే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా…మీ భార్యా, పిల్లలు బాధ పడతారు. నాకు అన్యాయం చేస్తే మీరు జీవితాంతం బాధపడతారు. నేను నిజాయితీపరుడిని. నాకు డబ్బు ఆశ చూపించినా నేను లొంగలేదు. నాకు మీడియానే న్యాయం చేయాలి. నాభార్య 7 వార్డుకు నామినేషన్ వేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడ్డాం. నా బిడ్డకు చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నా. దయచేసి మా జోలికి రావద్దు అంటే ఎవరో సంతకం పెట్టారని మా నామినేషన్ తీసేశారు. దొంగసంతకం పెట్టిన వారిపై కేసుపెట్టి మాకు న్యాయం చేయమని వేడుకొంటున్నాం.
వైసీపీ నాయకులకు చెబుతున్నా… దయచేసి వైసీపీ నాయకులు పోటీ చేసి గెలుచుకోండి. అంతేకానీ ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ను ప్లే చేయొద్దు. నాకు న్యాయం చేయకపోతే ఇదే మునిసిపాలిటీ ఆపీస్ లో పెట్రోల్ పోసుకుని చనిపోతా”
పోర్జరీ సంతకాలు చేయడంలో ఈ ముఖ్యమంత్రికి చాలా అనుభవం ఉంది. కోర్టుల్లో కూడా చాలా స్పష్టంగా తేలిపోయింది. ఎన్నికలను ఒక ప్రహసంనంగా చేసేశారు. ఈ 420 ముఖ్యమంత్రి పోర్జరీ చేసి ఎన్నికల్లో గెలిచామని గొప్పలు చెప్పకుంటున్నాడు. ఇది చాలా నీచం. రిటర్నింగ్ అధికారిని కూడా వదిలిపెట్టం. ఆయనపై కేసు పెట్టి చట్ట ప్రకారం ముందుకెళుతాం. మా అభ్యర్ది భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటే దానికి బాధ్యులు ఎవరు? జగన్ రెడ్డి రాజకీయం కోసం నిండు ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాడు. ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటారు. చాలామంది బయపడి బయటకు రాలేకపోయారు. కొంతమంది కోర్టులకు పోలేకపోయారు. కొంతమంది చనిపోయారు. జగన్ మోహన్ రెడ్డికి కనీస సామాజిక బాధ్యత ఉందా? కనీసం మానవత్వం ఉందా అని అడుగుతున్నా.
తిరుపతి ఎన్నికలు కూడా ఒక ఫార్స్. ఈ ఎన్నికల్లోను ఫేక్ ఐడీలు, డూప్లికేట్ ఆధార్ కార్డులు సృష్టించి దొంగ ఓట్లు గుద్దుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చి ఆఫీసర్లతో కుమ్మక్కై రిగ్గింగ్ చేసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సాక్ష్యాధారాలతో నిరూపించాయి. ఈ ఫార్స్ ఎన్నికలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం వహించాడు. ఈయన మాఫియా నాయకత్వంలో పెద్ద ఎక్స్ ఫర్ట్. ఇలాంటి పనులు చేసిన వాళ్లు ఏదో ఒకరోజు చట్టం ముందు తలవంచి శిక్ష అనుభవించక తప్పదు.
కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం. శాంతికి మారుపేరు. అక్కడి ప్రజలు అభివృద్ధి, సంక్షేమాలను కోరుకుంటారు. కుప్పం ప్రజలకు నేను ఎప్పుడూ చెప్పేవాడిని….. “లిటిగేషన్లు, కోర్టులు, పోలీసులు అవసరం లేదు. మీరు చట్టాన్ని గౌరవించే మంచి పౌరులు. ఇది మనం కొనసాగిద్దాం” అని చెప్పేవాడిని.
అలాంటి నియోజక వర్గంలో వైసీపీ నేతలు ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్నారు. నిప్పంటిస్తున్నారు. రౌడీలకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఇచ్చి, అక్రమ సంపాధన వారి చేతుల్లో పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 14 సంవత్సరాలు సి.ఎం గా చేసిన నా నియోజకవర్గంలోనే ఇలా చేశారంటే ఇతర నియోజకవర్గాలలో చేయడం వైసీపీ వాళ్లకు ఒక లెక్కా అని అడుగుతున్నా. ప్రజలంటే వైసీపీ నాయకులకు లెక్కుందా?. కుప్పంలో 14 వ వార్డులో తెదేపా అభ్యర్ధులుగా ప్రకాష్, ఆయన భార్య తిరుమగళ్ లు నామినేషన్ వేశారు. అక్కడ వెంకటేష్ అనే వ్యక్తి కూడా నామినేషన్ వేశారు. అతన్ని కొట్టి అతని నామినేషన్ పత్రాలను చించేసారు.
స్కృటినీలో అతని నామినేషన్ ను తిరస్కరించారు. ఆ తర్వాత తెలుగుదేశం అభ్యర్ధులు అక్కడ లేకపోతే…వాళ్లు సంతకాలు పెట్టినట్టు దొంగపత్రాలు సృష్టించి ఏకగ్రీవం చేసారు. ఈ విషయంపై న్యాయం చేయమని తెలుగుదేశం నాయకులు అక్కడకు వెళితే..కేసులు పెట్టి అరెస్టులు చేశారు. అన్ని మున్సిపాలిటీలలో 10 నుంచి 15 వార్డులను ఏకగ్రీవాలు చేసుకోవాలని కుట్ర చేశారు. దీనిపై ఎక్కడిక్కడ మున్సిఫల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాం. నెల్లూరులో 8 మంది ఏకగ్రీవం అయ్యారని చెప్పిన తర్వాత ఫైనల్ జాబితాను విడుదల చేశారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా.
చేసిన తప్పులు సరిదిద్దుకోకపోగా ‎ దానిని ప్రశ్నించినందుకు ‎ అమర్ నాధ రెడ్డి, పులివర్తి నానిలను భోజనం చేస్తుండగా అరెస్టు చేసి తీసుకెళ్లారు, ‎ నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి 1.30 కి 41 నోటీసు ఇచ్చి‎ అన్ని చోట్ల తిప్పి అవమానాలకు గురిచేశారు. పోలీసులు 41 నోటీసు ఇచ్చి వెళ్లాలి కానీ అరెస్టు చేసి తీసుకెళ్తారా? అదే కేసులో కొంతమందికి ‎41 మరికొంతమందికి ‎151 ప్రివెంటివ్ అరెస్టు సెక్షన్లు పెట్టారు. కొంతమంది హౌస్ అరెస్టు చేసి సెక్షన్ 30,31 ఏ కింద పెట్టారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా? రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా కొత్త చట్టం తెస్తున్నారు. దీనిపై మేం కోర్టుకెళ్తే మా వాళ్లను అరెస్టు చేయెద్దని కోర్టు చెప్పినా హౌస్ అరెస్టులు చేస్తారా?
దీనిపై ఎస్పీ, డీఎస్సీ సమాధానం చెప్పాలని కోర్టు చెప్పింది. వైసీపీ నేతలు బయట తిరగొచ్చు, ప్రచారాలు చేసుకోవచ్చు కానీ ‎ టీడీపీ నేతలు బయటకు రాకుండా అరెస్టు చేస్తారా? కుప్పం మున్సిపాలిటి పరిధిలో ‎ గతంలో నాకు 10 వేల మెజార్టీ వచ్చింది, టీడీపికి ఓటేయకుండా ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ‎మేం అధికారంలోకి ఉన్నపుడు పులివెందులలో ‎ఏకగ్రీవాలు చేసుకోలేమా? కానీ ప్రజాస్వామ్యబద్దంగా మేం నడుచుకున్నాం, పుంగనూరులో పెద్దిరెడ్డి పెద్ద నాయకుడా? నేను తలచుకుంటే ఆయన గతి ఏంటి? కుప్పంలో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రేషన డీలర్ల నుంచి పై విజిలిన్స్ దాడులు చేస్తున్నారు. అన్ని వర్గాలకు వేధిస్తున్నారు.
గురజాలలో నలుగురు అభ్యర్ధులకు పోలీసు రక్షణ కల్పించి నామినేషన్లు వేయించటంతోపాటు, ఎన్నికలు సజావుగా జరపాలని ఆదేశించింది. కానీ 1 వ వార్డు అభ్యర్ది వెంకటేష్ ని కిడ్నాప్ చేశారు. కోర్టు ఆదేశాలు దిక్కరిస్తారా? న్యాయ వ్యవస్ధలంటే ‎ లెక్కలేదా? ఇది ఉన్మాదం కాదా? మీ ఇష్టానుసారంగా వ్యహరిస్తామంటే కుదరదు. ‎రేపు అనే ఒక రోజు ఉంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే ప్రతి ఒక్కర్ని చట్టబద్దంగా శిక్షిస్తాం.
రాష్ట్రం కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు స్వచ్చందంగా భూములిస్తే రాజధానిని నాశనం చేశారు. రాజధాని కోసం పోరాటం చేస్తుంటే రైతులపై ‎దాడులు, దౌర్జన్యాలు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, అయినా వాళ్లు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. న్యాయస్ధానం నుంచి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దుతు చూసి ఓర్వలేక పోలీసులతో లాఠీ చార్జీ చేయిస్తారా? ఇది దుర్మార్గం కాదా? నాడు మేం ఇలానే వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర చేసేవారా? ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసేవారా? రైతులు పాదయాత్ర చేస్తే మీకొచ్చిన ఇబ్బందేంటి? వైసీపీ చేస్తున్న అరాచకాలకు, దౌర్జన్యాలకు ప్రజలే తిరగబడే రోజు వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి పేద విధ్యార్ధులు చదువుకుంటున్న ‎ ఎయిడెడ్ స్కూళ్లను విలేనం చేస్తున్నారు. దానిపై విధ్యార్ధులు నిరసన తెలిపితే వాళ్లపై లాఠీ చార్జి చేస్తారా? విధ్యార్దుల్ని మానసిక ఒత్తిడికి గురి చేయటమేకాక ‎పోలీసులతో బల ప్రయోగం చేస్తున్నారు. ‎ వైసీపీ పాలనలో ఇలాంటి అరాచకాలు కోకోల్లలు జరుగుతున్నాయి.
చట్ట వ్యతిరేకంగా రామానాయుడుని, నానిని హౌస్ అరెస్టు చేశారు, దీనిపై కోర్టు ‎ ఆర్డర్ ఇచ్చినా వాళ్లను వదలిపెట్టలేదు. పోలీసులు ‎ ఇప్పడు మరో 151 ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు రెండు పార్టీ వాళ్లను కంట్రోల్ చేయాలి, కానీ ఒకే పార్టీ నాయకుల్ని అడ్డుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తారా? మంత్రి అక్కడే తిరుగుతారు, కానీ రామానాయుడు తిరగకూడదా ? రామానాయుడేమైనా రౌడీనా, నేరస్తుడా? పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం ‎ ఆ వ్యవస్ధకే సిగ్గుచేటు. పోలీసులు తాము వేసుకున్న యూనిఫామ్ కైనా విలువివ్వాలి. ప్రజల కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. కానీ కొంతమంది పోలీసులు ఆ వ్యవస్ధ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తున్న పోలీసుల్ని ఈ 420 ముఖ్యమంత్రి, మంత్రులు కాపాడతారనకుంటున్నారమే.
ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. రాజ్యాంగ, చట్ట వ్యతరేకంగా వ్యవహరించిన వారికి శిక్షలు తప్పువు. నేనెప్పుడూ చట్టాన్ని దిక్కరించను చట్టవ్యతిరేక కార్యకలాపాల్ని ప్రోత్సహించను. అలాగే తప్పు చేసే వాళ్లను ‎వదలిపెట్టను. అమిత ఉత్సహంతో పోలీసులు లాఠీ చార్జి చేస్తున్నారు, ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, మానవత్వంతో వ్యవహరిచండి. వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమ పధకాలు రావని బెదిరిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పధకాలు అడ్డుకోవటం ఎవరి తరం కాదు. మీకు అన్ని పధకాలు అందేలా చర్యలు తీసుకుంటాం, ప్రజలు భయపడకుండా ఓటు ‍హక్కు వినియోగించుకోవాలి.
వైసీపీ ఓటేయపోతే సంక్షేమ పధకాలు రావ భయపడుతున్నారు. మీరు వాళ్లకు భయపడి వైసీపీకి ఓటేస్తే రేపు మీ ఇళ్లపై దాడులు చేస్తారు, మీ ఆస్తులు కబ్జాలు చేస్తారు. మీ పిల్లలకు కూడా రక్షణ ఉండదు. రౌడీ మూకలు చెలరేగిపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే ఉండదు. ‎ నిద్ర పోతున్న వ్యక్తిని లేపొచ్చు కానీ నిద్ర నటించే వారిని ఒక దెబ్బ కొట్టి లేపాలి. ఆ దెబ్బ కొట్టడానికే ఈ మున్సిపల్ ఎన్నికలు ఓటర్లు ఆలోచించాలి. అనేక రాష్ట్రాలు పెట్రోల్ పై రేట్లు తగ్గించినా రాష్ట్రంలో మాత్రం తగ్గించమని అంటున్నారు. ఇది లెక్కలేనితనం కాదా?
ట్రూ అప్ చార్జీలు పెంచారు, అన్ని పన్నులు పెంచారు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేశారు. మళ్లీ మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరో రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సి‎ద్దమయ్యారు. లెక్కలేనితనంతోనే ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. ఈ ఎన్నికల్లో దొంగ ఓటర్ కార్టులు తయారు చేసి ‎దొంగ ఓటర్లను ఇతర ప్రాంతాలను నుంచి తెస్తారు. బస్తాల్లో డబ్బులు పంచుతారు. అధికారులు వాళ్లను వదిలేసి మా వాళ్లపై తప్సుడు కేసులు పెడతారు, ఆల్రెడీ గురజాలలో టీడీపీ అభ్యర్ధిపై తప్పుడు కేసు పెట్టారు.
‎ వైసీపీ నేతలు ఇసుక, లిక్కర్, మైనింగ్ , భూ కబ్జాల డబ్బులన్ని ప్రజలకు పంచి మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు.‎ గతంలో తెనాలిలో టీడీపీ నేత ఇంట్లో మద్యం సీసాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అలానే తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE