జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద బిజెపి నిరసన

ఖరీఫ్ సీజన్లో వచ్చిన వరి ధాన్యాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6500 కేంద్రాలను వెంటనే తెరువాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద బిజెపి నిరసన కార్యక్రమాలను చేపట్టింది.
వరి వేస్తే ఉరి అని రాష్ట్ర రైతాంగాన్ని బెదిరించే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని పూర్తిగా కొంటామని చెప్పినా తప్పుడు ప్రకటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పై నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది.
ఈ రోజు జరిగిన నిరసన ప్రదర్శనలో అన్ని జిల్లాల బిజెపి అధ్యక్షులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కార్యకర్తల పైన రైతుల పైన అరెస్టు చేసిన సమయంలో దాడులకు పాల్పడడం సరైనది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పార్టీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు.
వరంగల్ కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి చేసిన నిరసన ఆందోళన కార్యక్రమాల్లో బిజెపి రాష్ట్ర కిసాన్మోర్చా ఇన్చార్జ్ & బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలు పద్మ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ధర్మారావు, కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీ రాములు తో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులను కార్యకర్తలను రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేశారు సంగారెడ్డిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి బి జయశ్రీ తో పాటు పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలను రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
వివిధ జిల్లా జరిగిన నిరసన కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజల్లో వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని రైతాంగాన్ని నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నది. సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడే ముఖ్యమంత్రి వరి ధాన్యం విషయంలో కూడా సమాఖ్య స్ఫూర్తి తో వ్యవహరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్నారు. ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం దుర్మార్గం. ఫామ్ హౌస్ లో ఉండే చంద్రశేఖర రావు రైతుల లో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం తీవ్రమైన నేరంగా భావించవలసి ఉంటుంది.
తప్పుడు ప్రచారాలతో భయపెట్టే విధానాన్ని ఇకనైనా మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు వరి ధాన్యం కొనుగోలు విషయంలో వరి ధాన్యం కొంటామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్రంలో వేసిన పంట దానికి సంబంధించిన దిగుబడి ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాలి.