Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీది ప్లీనరీ కాదు జబర్దస్ద్ ప్రోగ్రాం

-స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని పార్టీ ప్లీనరీకి ఎలా వెళ్తారు?
-ఇది పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కౌల్ అండ్ షగ్ధర్ గైడ్ లైన్స్ కి విరుద్దం కాదా?
-టీడీపీని, మీడియాను తిడ్డడానికి ప్లీనరీ పెట్టాలా?
– కూన రవికుమార్

వైసీపీ నిర్వహిస్తోంది ప్లీనరీ కాదు, జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి సాక్షి ఛానల్ లో నిర్వహిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ అని, స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారాం పార్టీ ప్లీనరీకి ఎలా వెళ్తారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

వైసీపీ నేతలు ప్లీనరీలో పొందు పర్చిన అంశాలు, తీర్మానాలు, ప్రజాసమస్యలపై మాట్లాడకుండా జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా టీడీపీని చంద్రబాబు నాయుడిని మీడియాను తిట్టేందేందుకు పోటీ పడ్డారు.జగన్ రెడ్డి నా వెంట్రుకలు పీకలేరని మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలందరికీ వెంట్రుకలు పిచ్చి పట్టుకుంది.

స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం పార్టీ ప్లీనరీకి ఎలా వెళ్తారు? పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కౌల్ అండ్ షగ్ధర్ గైడ్ లైన్స్ ప్రకారం స్పీకర్ పార్టీలకతీతంగా రెఫరీగా ఉండాలి. కానీ తమ్మినేని సీతారాం వైసీపీ ప్లీనరీలో పాల్గొనడం కౌల్ అండ్ షగ్ధర్ గైడ్ లైన్స్ కి విరుద్దం కాదా ? తన రాజకీయ విమర్శలకు కౌంటర్ గా వచ్చే విమర్శలపై స్పీకర్ గా ప్రొటెక్షన్ తీసుకుంటూ రాజకీయపార్టీ ప్లీనరీలో పాల్గొనటం అనైతికం కాదా? ముందు వైసీపీ సభ్యుడని, తరువాత శాసన సభ్యుడని, ఆ తరువాతే స్పీకరునని తాను ప్లీనరీ సమావేశాలకు రాకూడదా అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నాడు స్సీకర్ గా ఉన్న కోడెల శివ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఏ సమావేశాల్లోనూ పాల్గొనలేదు. కానీ ఆయన మహానాడులో పాల్గొనట్టు దమ్మాబుస్సుల సీతారాం వక్రీకరించటం సిగ్గుచేటు. తమ్మినేనికి నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అయ్యే శాపము ఉందేమో అందుకే తన జీవితంలో నిజం అనేది మాట్లాడరు

. కోడెల యూనిసేఫ్, గత ప్రభుత్వం వాళ్ళు నిర్వహించిన మహిళ సాధికారిత కార్యక్రమంలో పాల్గొన్నారు తప్ప టీడీపీకి సంబంధించి ఎటువంటి సమావేశాలకు హాజరు కాలేదు. స్పీకరుగా ఆ స్థానానికి వన్నె తెస్తే నేడు ఆ స్పీకర్ స్థానాన్ని తమ్మినేని దిగజార్చారు. మూడు సంవత్సరాలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మేనిఫేస్టోకు తూట్లు పొడిచిన జగన్ రెడ్డి పార్టీకి శాశ్వత అధ్యక్షడు అని ప్రకిటించుకోవటం సిగ్గుగా లేదా? ప్లీనరీలో నవరత్నాల పేరుతో చేసిన నవ మోసాలు గురించి కూడా ప్రజలకు చెబితే బాగుండేది. రైతు భరోసా రూ.13500 ఇస్తామని కేవలం రూ.7500 ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా రూ.13500 అకౌంటులో జమ అయ్యాయా? పిట్ట కథలు చెప్పడంలో బుగ్గన రాజేంద్రనాధ్ దిట్ట. పంచాయితీ రాజ్ నిధులు దారిమళ్ళించిన వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి మీద 420 కేసులు పెట్టాలి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 420 పనులు చేసిన జగన రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రయ్యాక కూడా 420 పనులనే చేస్తున్నాడు. సాక్షి పత్రికలో ప్రచురితమయ్యేయి పూర్తిగా అవాస్తవాలే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సాక్షి పత్రికలో వచ్చిన దుష్ప్రచారాలపై కమిషన్ చర్యలు తీసుకుంటామని కూన రవికుమార్ అన్నారు.

LEAVE A RESPONSE