రూ.12 వేల కోట్లు దొంగలించటం వికేంద్రకీకరణపై గొడ్డలి వేటు కాదా?

-పంచాయితీలు, మున్సిపాలిటీల నిధులు రూ. 12 వేల కోట్లు దొంగలించటం వికేంద్రకీకరణపై గొడ్డలి వేటు కాదా?
-కరెంట్ బిల్లులు కట్టకుండా తెచ్చిన రూ. 5 లక్షల కోట్లు అప్పు ఏం చేశారు?
-పెంచిన కరెంట్ చార్జీలు ఒగైరాల ద్వారా విద్యుత్ సంస్ధలకు వచ్చిన రూ.42 వేల కోట్లు ఏం చేశారు?
-టీడీపీ హయాంలోనే స్ధానిక సంస్ధల అభివృద్ది జరిగింది వాస్తవం కాదా?
– ప్రత్తిపాటి పుల్లారావు

నాడు టీడీపీ ప్రభుత్వం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయితీలను అభివృద్ది చేస్తే నేడు జగన్ రెడ్డి పంచాయితీ నిధుల్ని దొంగలించి గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ…

పంచాయితీలు, మున్సిపాలిటీల నిధులు రూ. 12 వేల కోట్లు దొంగలించటం వికేంద్రకీకరణపై గొడ్డలి వేటు కాదా? ఇది ప్రజల మద్య ప్రాతీయ చిచ్చు పెట్టేందకు కుట్ర కాదా? కరెంట్ బిల్లులు కట్టకుండా తెచ్చిన రూ. 5 లక్షల కోట్లు అప్పు ఏం చేశారు? పెంచిన కరెంట్ చార్జీలు వగైరాల ద్వారా విద్యుత్ సంస్ధలకు వచ్చిన రూ. 42 వేల కోట్లు ఏం చేశారు? టీడీపీ హయాంలోనే స్ధానిక సంస్ధల అభివృద్ది జరిగింది వాస్తవం కాదా? నాడు టీడీపీ ప్రభుత్వం గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయితీలను అభివృద్ది చేస్తే నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.7,660 కోట్లు దారి మళ్లించారు. అలాగే మున్సిపాలిటీల నిధుల్ని కూడా కలుపుకుంటే సుమారు రూ.12 వేల కోట్లు దారిమళ్లించిన ఘనత జగన్ మోసపు రెడ్డిది, జగన్ ప్రభుత్వానిది. పంచాయతీలకు సంబంధించి నిధుల్ని ఖర్చు చేసే అధికారం పంచాయతీ కార్యవర్గానికి మాత్రమే ఉంటుంది. పంచాయితీ తీర్మానం, సర్పంచ్, కార్యదర్శి సంతకంతో బిల్లులు చెల్లించాలి. కానీ జగన్ రెడ్డి పంచాయితీ తీర్మానం లేకుండా రాత్రికి రాత్రి పంచాయితీ నిధుల్ని దొంగిలించారు.

జగన్ రెడ్డి వికేంద్రీకరణ పేరుతో ప్రజల మద్య ప్రాంతీయ చిచ్చు కుట్రకు తెరతీశారు. వికేంద్రీకరణతో గతంలో 13 జిల్లాల్ని అభివృద్ది చేశాం. కానీ జగన్ రెడ్డి ఇప్పుడు 26 జిల్లాలు చేశారు తప్ప వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడం లేదు. వికేంద్రీకరణ అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో జగన్ రెడ్డి మాటలు కూడ అలానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో 26 శాఖలను అనుసంధానం చేసి ఫైనాన్స్ కమిషన్ నిధులు, నరేగా నిధులతో గ్రామలను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 24 వేల కిలో మీటర్లు సిమెంటు రోడ్లు, 14 వేల కి.మీ గ్రావెల్ రోడ్లు వేశాం. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలనున ఏర్పాటు చేశాం. 35.64 లక్షల మరుగుదోడ్లు, 21 లక్షల ఎల్.ఈ.డి లైట్లు, 4950 పంచాయతీ భవనాలు, 5855 అంగన్ వాడీ భవనాలు, 6500 స్మశాన వాటికలు అభివృద్ది చేశాం. నిధుల వినియోగం, పనులలో దేశ స్దాయిలో రాష్ట్రానికి గౌరవం, గుర్తింపు దక్కింది. పంచాయతీ రాజ్ శాఖకే 100 అవార్డులు వచ్చాయి.

కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దేశ స్దాయిలో రాష్ట్ర ప్రతిష్ఠ క్రింది స్థాయికి దిగజార్చిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. పార్లమెంట్ స్టాండింగ్ కమీటి రిపోర్టులో కూడా స్పష్టంగా దేశ వ్యాప్తంగా రూ. 974 కోట్లు ఆర్దిక అవకతవకలు జరిగితే అందులో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 261 కోట్లు దేశంలోనే అగ్ర స్దానంలో ఉంది. ఎల్.ఈ.డి లైట్లు తో పంచాయతీలకు విద్యుత్ ఆదాతో పాటు విధీ దీపాల నిర్వహణ సైతం రాష్ట్ర ప్రభ్గుత్వం తీసుకుకొవడం వలన పంచాయతీలకు ఆర్దిక భారం తగ్గింది. వై.సీ.పీ విద్యుత్ బిల్లులుపేరుతో పంచాయతీ ఎకౌంట్లను ఖాళీ చేసిన దుస్దితి. గెలిచిన పంచాయితీ సర్పంచులు, స్థానిక సంస్థలలో గెలిచిన వారు జగన్ మోహన్ రెడ్డి పార్టీలోని వారే జగన్ రెడ్డిని తిట్టుకొనే పరిస్థితి. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశలో నిధుల కేటాయింపులు చేకపోగా అందుకు భిన్నంగా కేటాయించే నిధులను పక్కదారి పట్టిస్తే స్థానిక సంస్థలు ఏం కావాలి ? స్థానిక సమస్యలపై పని చేయనివ్వకుండా స్థానిక ప్రజా ప్రతినిధులను మోసం చేసిన జగన్ రెడ్డి. స‌ర్పంచ్‌,వార్డు స‌భ్యుల‌కు తెలియ‌కుండా, పంచాయ‌తీ బోర్డు తీర్మానంలేకుండా పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్దానిక ప్రజాప్రతినిధుల్ని మోసం చేయటం కింద‌కే వ‌స్తుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం దారిమళ్లించిన రూ. 7,660 కోట్లు తిరిగి పంచాయితీ ఖాతాలకు జమచేసేవరకు టీడీపీ పోరాడుతుంది.

వైసీపీ ప్లీనరీ కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈనాడు, ఏబీఎన్, టీవీ5 రామోజీరావు, రాధా కృష్ణ, బి.ఆర్. నాయుడులను తిట్టడం కోసమే పెట్టారు. వాళ్లను తిట్టడానికి రూ. 20 నుంచి 25 కోట్లు ఖర్చుతో ప్లీనరి పెట్టాలా? ఆర్టీసీ బస్సులను మహానాడు కోసం డబ్బు కట్టి వినియోగించుకుంటాం అని అడిగినా ఇవ్వలేదు. కానీ నేడు డబ్బులు చెల్లించకుండానే ఆర్టీసీ, స్కూల్, ప్రైవేటు బస్సులను దౌర్జన్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి వైసీపీ కార్యకర్తల్ని తరలించేందుకు వాడుకున్నారు. ప్లీనరీ కోసం నాగార్జున యూనివర్సిటికీ సెలవులు ప్రకటించడం జగన్ రెడ్డి కుటిల బుద్ధికి నిదర్శనం. ప్లీనరిలో వైసీపీ నేతలతో చంద్రబాబు నాయుడు, లోకేషే, టీడీపీ నేతల్ని బూతులు తిట్టించటం తప్ప మూడేళ్ళలో ప్రజలకు ఏం చేశారో, రాబోయే రెండు ఏళ్ళలో ఏం చేస్తున్నామో చెప్పకపోవటం సిగ్గుచేటు.

వైసీపీ నేతల అవినీతిని, అరాచకాలను, దుర్మార్గాలను ప్రశ్నించినందుకు మీడియా దుష్టచతుష్టయమైతే జగన్ రెడ్డి అవినీతిని సమర్దిస్తున్న నీలిమీడియా మంచిదా? మూడేళ్ళలో సాక్షి పత్రికకు ప్రకటనం రూపంలో ప్రజల సొమ్ము రూ. 300కోట్లు కోట్లు దోచిపెట్టడమే కాక పైగా వాలంటీరులకు సాక్షి పత్రిక కొనుగోలు పేరుతో నెలకు రూ. 5 కోట్లు దోచిపెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. మీ అవినీతిని సమర్ధించకపోతే ఎల్లో మీడియా అని దుష్పప్రచారం చేస్తారా. ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీని, నాయకులును, కార్యకర్తలను ఎన్ని తిట్టినా ఏం చేసినా ప్రజల కోసం అరాచక ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Leave a Reply