Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ నేత సైకో సునీల్ ను శిక్షించాల్సిందే

-మైనారిటీ విద్యార్థిని మిస్బాను బలితీసుకున్న వైసీపీ నేత సైకో సునీల్ ను శిక్షించాల్సిందే
– విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం తరుపున జగన్ రెడ్డి కోటిరూపాయల పరిహారంఇవ్వాలి
• చిన్నారులను కాపాడలేని జగన్మోహన్ రెడ్డి, వారికి మేనమామ ఎలా అవుతాడు?
• ఆడబిడ్డలు తనకు అక్కచెల్లెమ్మలు అని డబ్బాలుకొట్టుకోవడంకాదు.. జగన్ రెడ్డి, వారికి ఏంన్యాయంచేశావో, చేస్తున్నావో సమాధానంచెప్పు
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

తన ధాహానికి వ్యవస్థలను నాశనంచేసి, 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రజలు వారిచెప్పులతో వారే కొట్టుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజులా భావిస్తుంటే, ఆయన అనుచరులు.. ఆయనపార్టీవారు ఆఖరికి పదోతరగతి ప్రశ్నపత్రాలు దొంగిలించి, అమాయకులైన చిన్నారులను బలితీసుకుంటున్నారని, పలమనేరులో మిస్బా అనే విద్యార్థిని ప్రాణంపోవడానికి ఈప్రభుత్వం కారణంకాదా అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు.

శుక్రవారం ఆమె జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే … ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంసంపాదించి, తనకుటుంబానికి అండగా నిలవాలనిభావించి, చక్కగాచదువుకుంటున్న చిన్నారిప్రాణం పోవడానికి ఈ ముఖ్యమంత్రిపాలనలోని వ్యవస్థల వైఫల్యమే కారణం. విద్యార్థిని మిస్బా ఎంతమానసిక క్షోభ అనుభవిస్తే బలవన్మరణానికి పాల్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒక విద్యార్థిని ప్రాణంతీసినవారు యథేచ్ఛగా కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. మిస్బా ప్రాణం పోవడానికి స్థానికవైసీపీఎమ్మెల్యే ముఖ్యఅనుచరుడైన సునీల్ అనేవ్యక్తే ప్రధానకారణం. సునీల్ తనకూతురుక్లాస్ లో టాపర్ గా రావాలన్న దుర్భుద్ధితోనే మిస్బాను తోటి విద్యార్థినులతో వేధింపులకు గురిచేయించాడు. మిస్బాకు ఉన్నపళంగా పాఠశాల యాజమాన్యం టీసీ ఇవ్వడానికి కూడా సునీల్ బెదిరింపులేకారణం. సునీల్ లాగా.. ఆయన కూతురిలాగా.. అంగబలం…. ఆర్థికబలం.. అధికారబలంలేని కుటుంబంలో పుట్టడమే మిస్బా చేసిన తప్పా?

మిస్బాను ఉన్నపళంగా పాఠశాలయాజమాన్యం టీసీ ఇచ్చిబయటకుపంపేసరికి ఆ పసిహృదయంతల్లడిల్లింది. తానుఏ తప్పుచేయకపోయినా…. తనను, తనతండ్రిని ఎందుకు పాఠశాలయాజమాన్యంతోపాటు, బయటివ్యక్తులు అనరానిమాటలన్నారని ఆచిన్నారి మనస్సు మనోవేదనకు గురైంది. దానిఫలితమే సదరుచిన్నారి ఫ్యాన్ కు ఉరివేసుకొని ప్రాణం తీసుకోవడం. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడైన వైసీపీనాయకుడు చెప్పాడని మిస్బా విద్యనభ్యసిస్తున్న పాఠశాలనిర్వాహకుడైన రమేశ్ కూడా… ఆ చిన్నారి ప్రాణంపోయేలా ప్రవర్తించాడు.

సదరు రమేశ్ కు , వైసీపీనేత సునీల్ కు పిల్లలులేరా.. వారిపిల్లల్లాంటే వారే మిస్బాలాంటి వారని తెలియదా? మీ పిల్లలను చదివించుకోవడానికి, వారికి మంచి ర్యాంకులు రాబట్టుకోవడానికి అభంశుభం తెలియని మిస్బాను బలితీసుకుంటారా? మిస్బా బలవన్మరణంపై ప్రభుత్వంగానీ, వైసీపీప్రజాప్రతినిధులు గానీ స్పందించేస్థితిలో లేరు. స్పందించినావారిపార్టీకిచెందిన సునీల్ నే వెనకేసుకొస్తారుగానీ.. అయ్యో చిన్నారి ప్రాణం పోయిందే అని కించిత్ కూడా పశ్చాత్తాపం వ్యక్తంచేయరు. అదీ వారి మనస్తత్వం.

బడ్జెట్ సమావేశాలను భజనసమావేశాలుగా మార్చి, పవిత్రమైన సభను పశువులదొడ్డిలా నిర్వహి స్తున్న అశుద్ధపువెధవలకు చిన్నారులప్రాణాలు, వారి తెలివితేటల విలువ ఏంతెలుస్తుంది? అసెంబ్లీలో ఆడబిడ్డలను దూషిస్తుంటే, వెకిలినవ్వులు నవ్వే సైకోముఖ్యమంత్రి.. మిస్బా ప్రాణం తీసినవారిని ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయాడు? మిస్బా చనిపోవడానికి పాఠశా ల నిర్వాహకుడు రమేశ్ ఎంతటికారకుడో… అతన్ని ప్రేరేపించిన సునీల్ కూడా అంతే కారకుడు.సునీల్ ను అరెస్ట్ చేయవద్దని అతని బాస్ అయిన వైసీపీఎమ్మెల్యే పోలీసులను ఆదేశించాడా? లేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలువచ్చాయా?

చిన్నారిఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులే… ఆ పసిపాపరాసిన సూసైడ్ నోట్ ను తస్కరించే ప్రయత్నంచేశారు. ఆ పాపచనిపోగానే పరుగులుపెట్టుకుంటూ ఆమెఇంటికెళ్లిన పోలీసులు సూసైడ్ నోట్ నుస్వాధనంచేసుకొని, దాన్ని తారుమారుచేసే ప్రయత్నంచేశారు. అలాఉన్నఆధారాలను, సాక్ష్యాలను మార్చేప్రయత్నం పోలీసులు ఎందుకు చేశారు..ఎవరిని కాపాడటానికి చేశారని ప్రశ్నిస్తున్నాం.

ముఖ్యమంత్రికి కూడా ఇద్దరు కూతుళ్లున్నారు.. వారిద్దరూ లండన్ లో చదువుతున్నారు. ఆ ఇద్దరిలో ఎవరోఒకరు మిస్బాలాంటి పరిస్థితినే ఎదుర్కొంటే ఈ ముఖ్యమంత్రి ఏంచేస్తాడని నిలదీస్తున్నాం. మిస్సా ఆత్మహత్యపై తనకు తానుగా స్పందించలేని ముఖ్యమంత్రి, కనీసం తనపార్టీఎమ్మెల్యేని కూడా ఆమె ఇంటికి పంపి, కుటుంబాన్ని ఓదార్చ లేకపోయాడు. అదీ ఈ ముఖ్యమంత్రి కఠిన హృదయం.

జగన్ రెడ్డికి కనీసం చిన్నారులహృదయాల్లోని బాధకూడా అర్థంకావడంలేదంటే.. అతని మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతోంది. మిస్బా మృతికి కారణమేంటో…అందుకుకారకులెవరని జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు? మిస్బా బలైంది ముమ్మాటికీ వైసీపీనేత సైకోయిజానికే. చిన్నారులకు తానుమేనమామను అనిచెప్పుకుంటున్న జగన్ రెడ్డి.. మిస్బా ప్రాణాలు తిరిగి తెచ్చివ్వగలడా? ఆమెకుటుంబాన్ని ఆదుకొని, తనపార్టీనేతను శిక్షించగలడా?

జగన్ రెడ్డి …. నిజంగా మిస్బామృతికి కారణమైన తనపార్టీకి చెందిన సునీల్ ను శిక్షిస్తే, నేనే స్వయం గా ముఖ్యమంత్రికి సలామ్ కొడతా. ఆడబిడ్డలు అక్కచెల్లెమ్మలు…వారిపిల్లలకు తాను మేన మామను అనిచెప్పుకోవడంకాదు… జగన్ రెడ్డి. ఆడబిడ్డలను వేధించి.. వారిపై అమాయకు లైన చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని శిక్షించు. తన..మన బేధం లేకుండా అందరినీ దారుణంగా శిక్షించు. అప్పుడు తేలుతుంది నువ్వు ఎలాంటినాయకుడివో. అంతేగానీ అసెంబ్లీలో .. బయటా నీపార్టీ వారితో భజన చేయించుకోవడం కాదు.

మిస్సా మృతిపై వైసీపీ మహిళానేతలు ఏం సమాధానం చెబుతారు? చిత్తూరులో ఉన్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే కి మిస్బామరణం చిన్నవార్తలా కనిపిస్తోందా? కొవ్వొత్తులతో ర్యాలీలు చేశారుకదా.. ఇప్పుడు ఏమైంది మీ ర్యాలీ?

ఎక్కడున్నాయి మీ నివాళులు? టీడీపీతరుపున మిస్బా కుటుంబసభ్యులను పరామర్శించడానికి మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి గారు వెళ్లారు. వైసీపీనుంచి ఒక్కడైనా వెళ్లాడా? గతంలో ఎవడో ఒకవెధవ ఒకఅమ్మాయి మరణానికి కారకుడయ్యాడనిచెప్పి…వాడు టీడీపీవాడని నానాయాగీచేశారు. కొవ్వొత్తుల ర్యాలీలన్నారు.. ధర్నాలన్నారు.. ఉపన్యాసాలు ఇచ్చారు. మరిప్పుడు ఎందుకు స్పందించరు?
తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చేవరకు మాట్లాడరా..లేక మిస్బా మృతికి కారకుడైన వాడు వైసీపీవాడని నోరు పెగలడంలేదా? ఎక్కడ ఎవరికి అన్యాయంజరిగినా అధికారంలోఉన్నప్పడు ఒకలానే స్పందించాలి. అలాంటి విజ్ఞత ఈ ముఖ్యమంత్రికి, ఆయనపార్టీ వారికి ఎప్పటికీ రాదు. మైనారిటీ విద్యార్థిని మిస్బా మృతికి కారకుడైన వైసీపీనేత సునీల్ ను ముఖ్యమంత్రి కఠినంగా శిక్షించాలని తెలుగుమహిళావిభాగం తరుపున డిమాండ్ చేస్తున్నాం. అలానే మిస్బా కుటుంబానికి కోటిరూపాయల ఆర్థికసాయం చేసి, బిడ్డనుకోల్పోయిన తల్లిదండ్రులకు అండగా నిలవాలి.

వైసీపీనేతలు, కార్యకర్తలు.. మీపార్టీ పేటీఎం కుక్కల వికృతచేష్టలకు ఇంకెంతమంది ఆడబిడ్డలు, చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకోవాలి జగన్ రెడ్డీ? పరిపాలనచేయడం.. ప్రజల ప్రాణాలు కాపాడటం ఈ ముఖ్యమంత్రికి చేతగాదని తేలిపోయింది. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎందరుఆడబిడ్డలు..చిన్నారులు ప్రాణాలు కోల్పోయారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శచేసుకోవాలి. మిస్బా మృతికి కారణం ముమ్మాటికీ వైసీపీనే. వైసీపీనేత సునీల్ ను ముఖ్యమంత్రి శిక్షించేవరకు తెలుగుమహిళా విభాగం ఈఅంశంపై పోరాడుతూనే ఉంటుంది.

LEAVE A RESPONSE