• జార్జియా వీసా పేరుతో మోసం.. బాధితులకు బెదిరింపులు
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు షరీష్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మంగళగిరి: కాకినాడకు చెందిన ఎం.దుర్గాదేవి మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. వైసీపీ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఎన్ ఎన్ కే రెడ్డి తమ కుటుంబాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నారు. సుపారి ఇచ్చి ఇంటి వద్ద హింసకు పాల్పడటమే కాకుండా బీరువా లాకర్లో ఉన్న ఆస్తి పత్రాలను అక్రమంగా తీసుకుని సుమారు 1200 గజాల స్థలాలు, 60 గజాల ఇల్లు ఆక్రమించుకొని వాటికి సంబంధించిన పత్రాలను దొంగలించి తమ పేర్లపై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ షరీష్, ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు అర్జీ ఇచ్చి కోరారు.
ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం పడమటి వెంకటాపురం గ్రామానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ఎం.ఎస్. అభినయ్ నాయక్ డోరు నెంబరు 27066, వట్టి రాజశేఖర్ హౌస్, కొత్తపేట, ధర్మవరం చెందిన అతనికి సంబంధించిన అభి ఫ్యూచర్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా జార్జియాలో వర్క్ వీసాలు ఇప్పిస్తామని చెప్పి తన వద్ద తమ స్నేహితులు వేముల సురేష్, షేర్ మస్తాన్ వారి ద్వారా సుమారు 20 మంది విద్యార్థులు, నిరుద్యోగుల ద్వారా సుమారు రూ.60 లక్షలు వరకు 2025 జనవరి నుండి 2025 జూన్ వరకు చెల్లించాం. అందులో 28 లక్షలు అభినయ్ నాయక్‌కి, 32 లక్షలు అతని తల్లికి వివిధ లావాదేవీల ద్వారా ఇచ్చాం. ప్రస్తుతం సుమారు 20 మంది విద్యార్థుల పాస్‌పోర్ట్‌లు కూడా వారి వద్దే ఉన్నాయి. డబ్బులు తిరిగి ఇవ్వాలని, పాస్‌పోర్ట్‌లు అందించాలని అడిగితే వారి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై దొనకొండ పోలీస్ స్టేషన్‌తో పాటు పలు చోట్ల ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
అన్నమయ్య జిల్లా, పెద్దతిప్పసముద్రం మండలం అముల్ దారునిపల్లి గ్రామానికి చెందిన సందె కృష్ణమూర్తి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సంధె నాగప్ప భార్య ఆది లక్ష్మమ్మ, రమగొప్ప, తను తమ తండ్రి ఆస్తిగా వచ్చిన 15 ఎకరాల భూమిని ముగ్గురూ సమానంగా పంచుకుని అడంగల్, పాస్ బుక్కుల్లో పేర్లు ఎక్కించుకుని ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అయితే ఎస్. మాలమ్మ అనే మహిళ గతంలో కుటుంబం విడిచి వేరే వ్యక్తితో వెళ్లిపోయి ఇప్పుడు తిరిగి వచ్చి ఈ 15 ఎకరాల ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న సర్వే సమయంలో ఎం.ఆర్.ఓ. కార్యాలయం వారు మాలమ్మకు కూడా వాటా ఇవ్వాలని సూచించడంతో భూమిపై ఆమెకు ఎలాంటి హక్కులు లేవు. భూమిలో ఆమెకు వాటా ఇస్తే తమకు అన్యాయం జరగుతుందన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.
అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం జీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన కందుల ఆంజనేయులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 25 ఏళ్ళుగా కువైట్‌లో కష్టపడి సంపాదించిన డబ్బుతో తన భార్య పగడాల శ్రీదేవి పేరుతో తిరుపతిలో ఇల్లు కొనుగోలు చేశాను. అయితే తన భార్య పగడాల శ్రీదేవి, కేబీపల్లీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సుభాష్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కుట్ర చేస్తున్నారు.
తనను తన కుమారుడు సంతోష్ ను చంపుతామని పలుమార్లు బెదిరించారు. రాత్రిపూట కడపలో తలదాచుకున్న సమయంలో రౌడి మూకలతో దాడి చేయించారు. తిరుపతిలోని తమ ఇంటికి వెళితే నిన్ను నీ కొడుకును చంపేస్తామని సుభాష్, శ్రీదేవి బహిరంగంగా బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన గుండెబోయిన రమణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. మనుకొండ జానినెహ్రూ అనే వ్యక్తి గేదెల లోన్ అక్షరాల రూ.2 కోట్లు ఇప్పిస్తాను అన్నారు. అందుకు ముందుగా రూ.25 లక్షలు ఇవ్వాలని చెప్పింది. ఆమెను నమ్మి అప్పు చేసి డబ్బులు ఇచ్చాను ఇప్పుడు ఆమె కనిపించడం లేదు ఫోన్ తీయడం లేదు. ఇందులో దుర్గప్రసాద్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు