-మహిళలను అగౌరవపరిస్తే ఎదురయ్యే పరిణామాలను వైసీపీ నేతలు చూడబోతున్నారు
-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కడప జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దీప్తి.ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరికి జరిగిన అవమానం, నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగాన్ని తట్టుకోలేక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుకు నిరసనగా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన దీప్తి.
దీప్తి రాజీనామా వైసీపీ నాయకుల తీరుకు చెంపదెబ్బ.నెలకు రూ.40వేలకు పైగా జీతం, కుటుంబ భవిష్యత్తును కూడా ఖాతరు చేయకుండా సాటి మహిళకు జరిగిన అవమానానికి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.దీప్తికి మంచి భవిష్యత్ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.అసెంబ్లీలో జరిగిన
పరిణామాలకు ప్రతీ మహిళ కన్నీరు పెట్టుకుంటోంది.అయినా మంత్రులు ఇంకా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు.అమరావతి కోసం పోరాడే మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేయడం దుర్మార్గం..వైసీపీ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడింది.