వారి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాలు కేటాయించలేరా?

Spread the love

-సొంత జిల్లాలో ఊళ్లకు ఊళ్లు, మనుషులు వరదలో కొట్టుకుపోతే వారి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాలు కేటాయించలేరా?
-బాధితుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి..సీఎం మాత్రం కనికరించలేక పోతున్నారు
-ప్రాజెక్టు నిర్వహణ లోపం, ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇంతటి జలప్రళయం
-ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది
-పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కడప జిల్లాలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఎగువ మందపల్లి, పులపుత్తూరు, గుండ్లూరులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పర్యటించిన పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న టీడీపీ నేతలకు సమస్యలు ఏకరవుపెట్టి కన్నీరుమున్నీరవుతున్న బాధితులు.
రెండు రోజులుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం.ఊళ్లకు ఊళ్లు నామరూపాలు కోల్పోయాయి. మనుషులు కొట్టుకుపోయారు..పశువులూ వరద పాలయ్యాయి.ప్రాజెక్టు నిర్వహణ లోపంతోనే ఇంతటి నష్టం జరిగింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.ఇంకా అనేక మంది మృతదేహాలు కూడా కనిపించడం లేదు..ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలి..పొలాల్లో వేసిన మేటలను కూడా తొలగించే బాధ్యత తీసుకోవాలి.లక్షలాది రూపాయల విలువైన పశువులను కోల్పోయిన రైతులకు తిరిగి పశువులను ప్రభుత్వమే ఇప్పించాలి.బాధిత ప్రజల డిమాండ్ మేరకు చెక్ డ్యాంలు, రక్షణ గోడలు నిర్మించిన తర్వాతే తిరిగి ప్రాజెక్టును ఆపరేట్ చేయాలి.
సొంత జిల్లాలో ఇంత విపత్తు సంభవిస్తే కనీసం 10 నిమిషాలు వచ్చి బాధితులను పలకరించే తీరిక సీఎం జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం దురదృష్టకరం.ఊళ్లకు ఊళ్లు, మనుషులు, పశువులు కొట్టుకుపోయినా సీఎంకి కనికరం లేకుండాపోయింది.గతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి విపత్తులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యేవారు.ఆయన నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనివ్వకుండా అధికారులందరినీ అప్రమత్తం చేసి ప్రజల ప్రాణాలను కాపాడేవారు.హుద్ హుద్, టిటిలీ ఇలా ఏ తుపాను వచ్చినా రోజుల తరబడి అక్కడే తిష్టవేసి పరిస్థితులు కుదుటపడేవరకు ప్రజలకు అండగా నిలిచేవారు..దురదృష్టవశాత్తు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది..రాష్ట్రంలో ప్రభుత్వమే లేకుండాపోయింది..ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది

Leave a Reply