ఏ ప్రభుత్వం అయినా వెనక్కి తగాల్సిందే

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా చెయ్యాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సందర్భంలో హర్షం వ్యక్తం చేస్తున్నమని బీజేపీ ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు యస్.శ్రీనివాసరావు, బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్. ఖలీఫాతుల్లా బాషా అన్నారు.బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.అమరావతినే రాజధానిగా ఉంచాలని బీజేపీ నిర్ణయమని 7006 రోజుల సుదీర్ఘంగా అమరావతి రాజధాని గా ఉంచాలని అమరావతి రైతుల న్యాయమైన పోరాటం విజయవంతమైoదన్నారు.ప్రజల ఇబ్బందులు పరిష్కరించడం కోసం ఏ ప్రభుత్వం అయినా వెనక్కి తగాల్సిందన్నారు.ఇప్పటికైనా అమరావతి రాజధాని పై స్వస్ఫష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి నుంచి తిరుపతి వరకు అమరావతి రైతులు చేస్తున్న పాద యాత్ర సందర్భంగా బీజేపీ అగ్రనేతలoతా ఇచ్చిన మద్దతు విజయవంతం అయింది అన్నారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రాజధానులా ఏర్పాటు బిల్లును వెనక్కి తీసుకున్న సందర్భంగా స్వీట్లు పంచారు.ఈ. కార్యక్రమంలో బీజేపీ sc మోర్చా జిల్లా అధ్యక్షుడు బాలకోటయ్య, ఒంగోలు నగర ఐదవ మండల అధ్యక్షుడు కె.అంజనేయలు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply