• ఆన్లైన్లో అక్రమ రిజిస్ట్రేషన్.. బాధితులకు వీఆర్వో బెదిరింపులు
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మన్నవ మోహన్ కృష్ణ, పేరేపి ఈశ్వర్
మంగళగిరి: సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన కె.పద్మావతి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. తమ మామకు ఆరుగురు అన్నదమ్ములు. వారిలో ఒకటి, రెండో వ్యక్తికి సర్వే నె. 297-6లో 5.41 సెంట్లు భూమి ఉంది. మిగిలిన నలుగురికి సర్వే నెం.402 లో 1.33 సెంట్లు భూమి ఉంది. ఒక్కొక్కరికి 2.58 సెంట్లు.. ఇది పట్టా భూమి 1980లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ అగ్రిమెంట్ లో ఆరుగురి పేర్లు ఉన్నాయి. 1980 నుంచి సాగులో ఉన్నారు. వారి ముగ్గురు 1999 భూమిని అమ్మేశారు. కానీ అప్పుడు మొదటి, రెండో వ్యక్త ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఆరుగురిలో ఐదుగురు మరణించారు. కానీ, మొదటి వ్యక్తి రెండో వ్యక్తి కుమారులు సర్వే నెం.402లో భూమి కలదని 2023 సెప్టెంబరులో కొంత మంది వైసీపీ నాయకులతో కలిసి మొదటి వ్యక్తి భార్య, రెండో వ్యక్తి భార్య పేరుపై 1బీలో ఎక్కించి తమపై దౌర్జన్యానికి దిగి చంపేస్తామని బెదిరిస్తున్నారు.
వారిపై చర్యలు తీసుకోని తమ భూ సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, ఏపీ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా, వేంపల్లె మండలం నెలవరం తండా గ్రామానికి చెందిన సభావాత్ వాకమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ మామ బద్దె నాయక్ పేరున ఖాతా నంబరు 928 సర్వే నంబరు 631లో 4.12 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తమ కుటుంబానికి ఏకైక జీవనాధారం. గత ప్రభుత్వంలో అప్పటి తహసీల్దారు చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక వీఆర్వో రవిరెడ్డి లంచాలు తీసుకొని కంచెర్ల మనోహర్, అనుకుల నాగులమ్మ పేర్లతో ఒకే సర్వే నంబరును డుప్లికేట్గా ఆన్లైన్లో ఎక్కించారు. ఒకే సర్వే నంబరు ఇద్దరికీ ఎలా వస్తుందని ప్రశ్నిస్తే తహసీల్దారు తాత్కాలికంగా ఎక్కించామని చెప్పారు.
తమ మామ బద్దె నాయక్ గుడిసె కాలిపోయినప్పుడు అందులో ఉన్న అసలు డీ-ఫారం పత్రాలు కూడా దగ్ధం అయ్యాయి. ఆ విషయం తెలిసి వారు మాకు తెలియకుండా నకిలీ ఎంట్రీలు చేశారు. తమ పత్రాలను ఉపయోగించి వీఆర్వో రవిరెడ్డి కంచెర్ల మనోహర్కి జిరాక్స్ ఇచ్చాడు. ఒరిజినల్ ఢీపారం వీఆర్వో రవిరెడ్డి దగ్గర ఉంది. దాని కోసం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే తమని సంతకాలు చేయమని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామకు చెందిన రావెళ్ల కరుణాకుమారి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నంబర్ 184-ఎలో గల మాగాణి ఎకరం పొలం తన అమ్మమ్మ బాల్లెపల్లి లక్ష్మమ్మ, బాల్లెపల్లి పెద పిచ్చయ్య వీలునామా ద్వారా తన తల్లి రావెళ్ళ సూర్యాంబ, చంద్రకమలాంబ (పిన్ని)లకు 1985లో సంక్రమించింది. 1990లో అమ్మమ్మ మరణించగా అప్పటి నుండి ఆ భూమిని కౌలుకు ఇచ్చి ప్రతిఫలం పొందుతూ వచ్చాం.
2013లో తమ తల్లి సూర్యాంబ మరణించాక మేనమామ బాల్లెపల్లి హనుమంతరావు కౌలుదారుల వద్ద నుండి డబ్బులు తీసుకొని తనకు అందజేస్తున్నారు. ఆయన 2020లో మరణించిన తరువాత కూడా గతంలో ఉన్న కౌలుదారులకే భూమిని ఇచ్చి ప్రతిఫలం పొందుతూ వస్తున్నాను.
బొల్లెపల్లి ఆరుబాబు, బొల్లెపల్లి అప్పారావు కుటుంబ సభ్యులు వారి ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆ పొలం తమదేనంటూ కౌలు ఇవ్వొద్దని కౌలుదారులను బెదిరిస్తున్నారు. ఈ భూమి తమ కుటుంబానికి 35 ఏళ్ళుగా అనుభవంలో ఉంది. ఇది తమ హక్కు అయినప్పటికీ మమ్మల్ని బెదిరించి జీవనాధారాన్ని కాజేయాలనుకుంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం, పెద్దపరిమి గ్రామానికి చెందిన వెంకటరావమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెంబర్ 375లో 210 గజాల్లో డాబా, రేకులతో ఇల్లు కలిగి ఉన్నాను.
తమ స్థలానికి తూర్పు హద్దున ఘట్టమనేని కృష్ణ అనేవారు ఉన్నారు. వారు తమ స్థలంలోకి వచ్చి చెట్లు నాటారు. తమ స్థలంలోకి తమని రానివ్వకుండా గొడవ చేస్తున్నారు. దీనిపై తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. తమ స్థలం తమకు ఇప్పించాలని అభ్యర్థించారు