– మంజూరు కాని పాస్‌పుస్తకాలు
– దొంగ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ పై ఫిర్యాదు
– అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన టీడీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు
మంగళగిరి: కడప జిల్లా, పోరుమామిళ్ల గ్రామానికి చెందిన యక్కంటి లక్ష్ముమ్మ సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో కార్యాలయ వర్గాలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు. తమ గ్రామంలో సర్వే నెం.34లో 0.95 సెంట్లు భూమి కలదు. తన భర్త కొంతకాలం క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయారని ఇద్దరు ఆడపిల్లలను పోషించుకునేందుకు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం వేములపాడు గ్రామానికి చెందిన కర్నాటి బలరామిరెడ్డి, కర్నాటి రంగమ్మ అనే వ్యక్తులు మోసం చేసి, దొంగ పత్రాలతో భూమిని రిజిస్టర్ చేయించుకుని మరో వ్యక్తికి రూ. 24 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా, కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అయినప్పటికీ ఆ వ్యక్తులు తనను చంపుతామని బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కార్యాలయ వర్గాలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం, తలపుల గ్రామానికి చెందిన జలగం నాగేశ్వరనాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం.1843/3 పుంజ విస్తీర్ణం ఏ.0.96 సెంట్లు డి.నె.3882/2019 తేదీ 2019 అక్టోబరు 18న నాయుడు విక్రయ దస్తవేజు ద్వారా తమకు సంక్రమించింది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు పాసు బుక్ కు అప్లై చేసిన వైసీపీ నాయకులు మాటలు విని తమకు పాస్ బుక్ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ నాయకులు జి. వెంకట్రమణ, అమరనాధరెడ్డి, రాజానాయుడు వీరు అందరు కలిసి ప్రస్తుతం తలపుల గ్రామ వీఆర్వోకి తమ పలుకుబడిని ఉపయోగించి ఆ సర్వే నెంబర్ గల భూమికి ఆన్ లైన్ లో పట్టాదారు పాస్ బుక్ నమోదు చేయడం లేదు. వారిపై చర్యలు తీసుకోని సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఏలూరు జిల్లా, టి.నర్సాపురం మండలం కొల్లివారిగూడెం గ్రామానికి చెందిన బలుసు సత్యవతి అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామ పరిధిలో ఖాతా నెం.228 సర్వే నెం. 18-బీ య.3.70 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. తమ భూమికి పూర్వం నుంచి ఉన్న దారిని దామశెట్టి సత్యనారాయణ, సి.ఆర్.రావు, కొడాలి రామశేషగిరిరావు అనే వ్యక్తులు రాజకీయ అండదండలు ఉపయోగించి పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
తమ గ్రామంలోని వైసీపీ నాయకులు వారికి మద్దతు పలుకుతూ తమ భూమిలోకి దారి లేకుండా చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదు.