Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి నేతలు రాజకీయాలు మాని రాష్ట్రం కోసం పని చేయండి

-జీవీఎల్ నరశింహ రావు

ఎపిలో చేపట్టిన ప్రాజెక్టు లు, నిర్మాణాలు, నిధులకు సంబంధించి చట్ట సభల్లో నేనే ప్రస్తావించా.కేంద్రం నుంచి ఎపి కి ఎంతవరకు సాయం చేయగలమని ఆలోచన చేస్తున్నా.వైసిపి 22మంది ఎంపీలు చేయాల్సిన పనిని నేనే చేస్తున్నా.విశాఖ లో 22వేల కోట్ల తో భారీ ప్రాజెక్టు ను బిజెపి చేపట్టింది.1956 నుండి నేటి వరకు ఇంత పెద్ద ప్రాజెక్టు రాలేదు.మీ కుటుంబ, వారసత్వ పాలన గురించి మాత్రం గొప్పలు చెప్పుకుంటారు.కేంద్ర పధకాలకు స్టిక్కర్లు వేసుకుని, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు.మీ ప్రయత్నం, మీ కృషి ఎక్కడైనా ఉందా అని వైసిపి నేతలను ప్రశ్నిస్తున్నా.ఎపికి ఇంత చేస్తుంటే…‌ కనీసం కేంద్రానికి ధన్యవాదాలు కుడా చెప్పలేకపోయారు.బిజెపి చేస్తున్న పనుల గురించి మాట్లాడితే… మీ లోపాలు బయట పడతాయనే భయం మీకు.బడ్జెట్ లో రాష్ట్ర ప్రస్తావన లేదని అసత్యాలు ప్రచారం చేస్తారా?.ఏమి చెయ్యకుండానే ఎపికి ఇన్ని ప్రాజెక్టు లు, రోడ్లు వచ్చాయా.ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ను చదవడమే వైసిపి నాయకులకు అలవాటు.ఈనెల 17న గడ్కరీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు.

వైసిపి ఎంపీలు అసమర్ధులు.. అందులే సందేహం లేదు.మీ నియోజకవర్గ సమసపై కూడా మాట్లాడటం చేతకాదా.కనీసం కేంద్ర మంత్రులు అపాయిట్మెంట్ కూడా తెచ్చు కోలేదు.మీ నియోజకవర్గాలలో రోడ్ల దుస్థితి మీకు కనిపించడం లేదా.వైసిపి ప్రభుత్వం వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే కొత్త సమస్యలు తెర పైకి తెస్తున్నారు.గత యేడాది చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇంకా చెల్లించ లేదు.జీతాలు, పెన్షన్ లు ఇవ్వలేని స్థితి లో ఎపి ప్రభుత్వం ఉందని నేను మాట్లాడా.పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి చొరచ చూపాలని నేను కేంద్రాన్ని కోరాను.లక్ష కోట్లలో ఎపి కి ఐదు వేల కోట్లు రానున్నాయి.రైల్వే ప్రాజెక్టు లను ఈ నిధులతో పూర్తి చేయాలి.365 రోజులూ ఎపి అభివృద్ధి కోసం మా వంతు పని చేస్తున్నాం.విశాఖపట్నం రైల్వే జోన్ కు ఇబ్బందులు ఉన్నా త్వరలో అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.రాష్ట్రానికి మేలు చేయాలని మేము పని చేస్తుంటే… మా పై విమర్శలు చేస్తారా.సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.ఎపికి అంతకు మించి ప్యాకేజీ రూపంలో కేంద్రం నిధులు ఇచ్చింది.ఆనాటి సిఎం చంద్రబాబు అంగీకరించి నిధులు తెచ్చుకున్నారు.ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు.అన్నీ తెలిసి కూడా జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారు.ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు.. కానీ నిధులు తెచ్చుకునేందుకు కృషి చేయాలి.హోదా అజెండా తో వచ్చారు కాబట్టే జగన్ … గుర్తు వచ్చినప్పుడల్లా మాట్లాడతారు.

కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా కి లేఖ రాసిన జీవియల్
తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య ఉన్న ద్వైపాక్షిక, వివాదాస్పద సమస్యలు పై చర్చించాలి.సూచనలు చేసే కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను.ఫిబ్రవరి17న జరిగే సమావేశంలో మొదటి అజెండా లో తొమ్మది అంశాలు ఉన్నాయి.సవరించిన అజెండా లో ఐదు అంశాలు మాత్రమే ఉన్నాయి.ఎపి కి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణ కు సంబంధం లేదు.వైసిపి, టిడిపి, సిపిఎం లు రాజకీయ కోణంలో చూస్తున్నాయి.సవరించిన అజెండాతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఎపి లో రాజకీయ డ్రామాలు, నేతల నటనలు ఎక్కువ.ఎపి సమస్యలు పై చర్చ ఈ‌ కమిటీలో జరగదనే చర్చ జరుగుతుంది.ఎజెండాలో నాలుగు అంశాలను తొలగించడానికి గల కారణాలను సమావేశంలో వివరించాలి.కమిటీలో చేసిన నిర్ణయాలను అమలు చేసేలా చూడాలి.హోదా అంశంలో కేంద్రం, ఎపిల మధ్య చర్చలు జరిగేలా కమిటీ ని ఏర్పాటు చేయాలని కోరాను.నేను పలు అంశాలను ప్రస్తావించినా… అమలు నిర్ణయం కేంద్రం చూసుకుంటుంది.ప్రత్యేక హోదా అనేది లేదు… నిధుల సమీకరణ కోసం కృషి చేయండి.తెలుగుదేశం ఇలానే వెళ్లి బోర్లా పడింది..వైసిపి నేతలు రాజకీయాలు మాని రాష్ట్రం కోసం పని చేయండి.మమ్మలను డ్యామేజ్ చేయాలని చూస్తే వైసిపికే డ్యామేజీ.వాస్తవాలను గుర్తించక పోతే చంద్రబాబు లాగా జగన్ కూడా జీరో అవుతారు.పార్లమెంటు లో కూడా టిడిపి, వైసిపి సభ్యులు విమర్శలు చేసుకుంటున్నారు.వారికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలు పట్టడం లేదు.బురద జల్లే రాజకీయాలు ఇప్పుడు అయినా మానుకోవాలి.ప్రత్యేక హోదా పై ఎవరి ప్రయత్నం వారు చేద్దాం.

లేఖ వివాదం పై జీవియల్
ఎపి కి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు మేమే డిమాండ్ చేశాం.అప్పుడు టిడిపి, వైసిపి లు చట్ట సభలలో నిద్ర పోయారు.హోదా కు బదులు ప్రత్యేక ప్యాకేజీ కింద అదనపు నిధులు తెచ్చారు.హోదా అంశంలో వైసిపి ట్రాప్ లో చంద్రబాబు పడ్డారు… ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.ధర్మ దీక్షలు కాకుండా ప్యాకేజీ వల్ల జరిగే ప్రయోజనాలు చెబితే ప్రజలు ఆదరించే వారేమో.ఇప్పుడు మళ్లీ హోదా అంశం పై జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు.రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కోసం కేంద్రం చొరవ చూపుతుంది.ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు.అందుకే జరిగిన పొరబాటును గుర్తించి ఆ అంశాన్ని తొలగించాం.ఈలోపే వైసిపి తమ గొప్పలుగా ప్రచారం చేసుకున్నారు.ప్రచార ఆర్భాటాలు మాని..‌ ప్రజల‌ కోసం పని చేయాలి.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి.జీవియల్ మాట్లాడి హోదా అంశం తొలగించారని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.చంద్రబాబు చెబితే మేము మార్చనట్లు సిగ్గులేకుండా వైసిఒఇ నాయకులు మాట్లాడతారా.మోడి, అమిత్ షా నిర్ణయం చేస్తే మేము మార్చగలమా.ప్రజలు కూడా వైసిపి చేస్తున్న రాజకీయ క్రీడలను అర్ధం చేసుకోండి.పాత్రికేయుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం ,ఒబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసం ఉమామహేశ్వరరాజు లు పాల్గొన్నారు

LEAVE A RESPONSE