మంగళగిరి: వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) తెదేపాలో చేరారు. శుక్రవారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.
ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎన్టీఆర్ భవన్లో సందడి నెలకొంది. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.