Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో పెళ్లికి రెండో భార్య సాక్షి సంతకం

కైకలూరు : వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ అధికారిణిగా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని వారికి అందజేశారు.

జయ మంగళ రెండో భార్య సునీత, కుమారుడి సమక్షంలో ఈ వివాహం జరిగింది. వివాహానికి సునీత సాక్షి సంతకం చేయడం గమనార్హం. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. వారికి ఒక కుమార్తె. తర్వాత సునీతను వివాహం చేసుకోగా వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకుంటున్న సుజాతకు ఇది రెండో వివాహం. ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు.

LEAVE A RESPONSE