Suryaa.co.in

Andhra Pradesh

సీమ బలిజలను అవమానిస్తున్న వైసీపీ రెడ్డి కులదురహంకారం

– బలిజలకు రాజకీయాలెందుకని అవమానిస్తారా?
– జగన్మోహన్ రెడ్డి అహంకారి
– వైసీపీని రాజకీయ సమాధి చేసేది రాయలసీమ బలిజలే
– వైసీపీ రెడ్లను ఓడించడమే బలిజల కర్తవ్యం
– లేకపోతే బలిజల ఉనికి కష్టం
– టీడీపీలోనే బలిజలకు గౌరవం
– బలిజలకు ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే
– బలిజనాడు కన్వీనర్‌, టీడీపీ నేత ఓవి రమణ

రాయలసీమ బలిజలపై వైసీసీ చిన్నచూపు చూసి అవమానిస్తోందని, బలిజనాడు కన్వీనర్‌, టీడీపీ నేత, టీటీడీ మాజీ సభ్యుడు డాక్టర్‌ ఓ.వి.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజలకు రాజకీయాలు ఎందుకంటూ వైసీపీ రెడ్లు కులదురహంకారంతో మాట్లాడుతున్నారని, వారికి వచ్చే ఎన్నికల్లో బలిజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బలిజలకు రాజకీయాలు ఎందుకన్న వైసీపీ రెడ్లను ఓడించాలని రమణ పిలుపునిచ్చారు.

తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన రమణ.. రాయలసీమ బలిజలను అవమానిస్తున్న వైసీపీ రెడ్లకు, వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టాల్సిన చారిత్రిక అవసరం రాయలసీమ బలిజలకు ఉందన్నారు. సీమలో రెడ్ల పెత్తనానికి బలిజలు తెరదించాల్సిన సమయం వచ్చిందన్నారు.

‘‘ శతాబ్దాల నుంచి రాయలసీమలో బలిజను రాజకీయ-ఆర్ధిక రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్న రెడ్ల పెత్తనానికి ఈ ఎన్నికల్లో తెరదించకపోతే, భవిష్యత్తులో బలిజల ఉనికి కష్టమవుతుంద’ని హెచ్చరించారు. టీడీపీలోనే బలిజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. రాజకీయాల్లో బలిజలకు ఎక్కువ సీట్లు ఇచ్చి, వారికి అత్యున్నత స్థానం కల్పించిందని ఎన్టీఆరేనన్న విషయం విస్మరించకూడదని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి అహంకారి. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లోను పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. వైసీపీలో ఒక సామాజికవర్గం వారే ముఖ్య నేతలుగా చలామణి అవుతున్నారు. వైసీపీలో అణగదొక్కే ధోరణి ఉండడంతోనే ఆ పార్టీని వీడాను.

రాయలసీమ బలిజలను అధికార పార్టీ నేతలు చిన్నచూపు చూస్తున్నారు. బలిజలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాను.చంద్రబాబు కూడా బలిజ కులస్తులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని బలిజ కులస్తులందరూ టిడిపి వైపే ఉన్నారు. బలిజ కులస్తులు టిడిపిలో చేరితే అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు పంపుతున్నారు.

బలిజ కులస్తులారా మేల్కోండి..వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవాల్సిన అవసరం ఉంది.రాయలసీమలోని బలిజ కులస్తులారా ఆలోచించండి.. కలిసికట్టుగా టిడిపిని గెలిపించుకుందాం.ఏపీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది.తిరుమల అన్నదాన సత్రంలో నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదు? అన్నదాన సత్రాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయండి. తిరుపతిలో ఎందుకు మద్యపాన నిషేధం చేయడం లేదు?

LEAVE A RESPONSE