Suryaa.co.in

Andhra Pradesh

జేపీ సంస్థ ముసుగులో జగన్ అండ్ కో ఏటా రూ.7వేల కోట్ల ఇసుక దోపిడీ

– జేపీ సంస్థపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమాభిమానాలు ఉండబట్టే, ప్రజలు బుక్ చేసుకున్నఇసుకతోపాటు, కృష్ణానదిలోని డ్రెడ్జింగ్ ఇసుకను, డంపింగ్ యార్డ్ ల్లోని ఇసుకను దానిపరంచేశారు. జగన్మోహన్ రెడ్డి తనపుట్టిన రోజు కానుకగా ప్రజలకోసం తక్షణమే ఉచితఇసుకవిధానం అమలుచేయాలి.
• రీచ్ లలో టన్నుఇసుకధర రూ.475 మాత్రమేనని, రీచ్ లనిర్వహణ చేపట్టిన జేపీసంస్థ ప్రభుత్వానికి టన్నుకి రూ.375లు చెల్లిస్తోందని చెబుతున్నారు
• గోపాలకృష్ణ ద్వివేదీ గారే స్వయంగా జేపీసంస్థకు రూ.72కోట్లకంటే మిగలదన్నారు
• జేపీ సంస్థకు రాష్ట్రంలోని ఇసుకరీచ్ లను అప్పగించేనాటికి డంపింగ్ యార్డ్ ల్లో 14.35లక్షల టన్నులఇసుకనిల్వఉంది. దానివిలువ రూ.70కోట్ల పైమాటే
• అదేసమయానికి ప్రజలు లక్షా60వేలటన్నుల ఇసుకకావాలని ఆన్ లైన్లో బుక్ చేసుకొని రూ.10కోట్లవరకు ప్రభుత్వానికి చెల్లించారు
• ప్రజలు చెల్లించిన రూ.10కోట్లసొమ్ము ప్రభుత్వం ఇంతవరకు వారికి తిరిగివ్వలేదు..ఇసుకా సరఫరాచేయలేదు
• జగనన్న ఇళ్ల నిర్మాణపథకంలో భాగంగా ప్రభుత్వం ఏటా 15లక్షల60వేల ఇళ్ల నిర్మాణం చేపడుతుందని, దానికి3కోట్ల60లక్షలటన్నుల ఇసుక అవసరమవుతుందని, ఆఇసుక ఖరీదు రూ.1472కోట్లను ప్రభుత్వమే జేపీసంస్థకు చెల్లిస్తుందన్నారు
• కృష్ణానదిలో ఇరిగేషన్ శాఖ సొంతఖర్చుతో డ్రెడ్జింగ్ చేసి తీసిన కోటి20లక్షల టన్నుల ఇసుకను కూడా జేపీసంస్థకే అప్పగిస్తున్నారు. దాని విలువసుమారు రూ.570కోట్లు
• డ్రెడ్జింగ్ ఇసుకసహా, డంపింగ్ యార్డ్ ల్లోని రూ.70కోట్ల ఇసుకను, ప్రజలు బుక్ చేసుకున్న లక్షా60వేలటన్నులఇసుకను ప్రభుత్వం ఎందుకు జేపీసంస్థకు ధారాధత్తం చేసిందని ప్రశ్నిస్తున్నాం
• ఈప్రభుత్వానికి శేఖర్ రెడ్డి, ఆయన జేపీ సంస్థపైఎందుకంత ప్రేమాభిమానాలు?
• రాష్ట్రంలో ఇసుకదోపిడీలేదని, ప్రజలకు అందుబాటులో ఉందన్న పాలకుల మాటలు పచ్చి అవాస్తవాలు
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రాష్ట్రంలో జరుగుతున్నఇసుకదోపిడీని మాటల్లో వర్ణించలేమని, ఇసుకదొరక్క ప్రజలు, నిర్మాణరంగం పనివారు ఉపాధికోల్పోయి నానాఅవస్థలు పడుతుంటే, ఈ ప్రభుత్వం మాత్రం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం మెరుగైన ఇసుకవిధానం అమలుచేస్తోందని పత్రికల్లో భారీప్రకటనలు ఇస్తోందని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి గారు స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ప్రభుత్వం ఇచ్చిన పత్రికాప్రకటనల్లో ఇసుకరీచ్ లవద్ద టన్నుఇసుకకు రూ.475లు ధర నిర్ణయించారని, రూ.375లను ఇసుకరీచ్ లు నిర్వహిస్తున్నకంపెనీ ప్రభుత్వానికిచెల్లిస్తోందని చెబుతున్నారు. ఇసుకఅవసరమైనవారు, వారిరవాణావాహనాల్లో వారే నేరుగా ఇసుకనుతీసుకెళ్లే అవకాశం కల్పించాక, ఇకఇసుకదోపిడీ ఎక్కడ జరిగిందని, రూ.2వేలకోట్ల అవినీతికి స్థానంఎక్కడిదని ప్రకటనల్లో ప్రభుత్వమే ప్రశ్నించింది.

టన్నుఇసుక రూ.475 అనిచెప్పినప్రభుత్వమే, నవంబర్ 15వతేదీన సమాచారహక్కు చట్టం కింద డీ.నరేంద్ర అనేవ్యక్తి అడిగినప్రశ్నకు సమాధానంగా టన్నుఇసుకను రూ.900లవరకు అమ్మవచ్చని చెప్పింది. ప్రభుత్వాధికారులు సమాచారహక్కు చట్టం కింద అడిగినప్రశ్నలకు సమాధానంగా ఇచ్చిన

వివరాలను ఒకసారి పరిశీలిస్తే, వినుకొండలో రూ.1025లు, చోడవరం రూ.920, తీపారు రూ.475, తణుకు రూ.885లు, మార్కాపురంలో టన్నుఇసుక రూ.1290 లవరకు అమ్ముతున్నారనిచెప్పారు. రీచ్ లో టన్నుఇసుక కేవలం రూ.475లు మాత్రమేనని , దానిప్రకారం రాష్ట్రంలో ఇసుకరీచ్ లు పొందినసంస్థ ప్రభుత్వానికి ఏటా చెల్లించేది కేవలం రూ.765 కోట్లు మాత్రమేనని గతంతో గోపాలకృష్ణద్వివేదీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

జగన్ ప్రభుత్వం నిర్మించబోయే 15లక్షల60వేల జగనన్నఇళ్ల నిర్మాణానికి 3కోట్ల60లక్షలటన్నుల ఇసుక అవసరమవుతుందని, ఆ ఇసుకమొత్తానికి అయ్యేఖర్చుని ప్రభుత్వమే చెల్లిస్తుందని కూడాచెప్పారు. ప్రభుత్వంచెప్పిన 3కోట్ల60లక్షలటన్నులఇసుక ఖరీదు, పాలకులు చెప్పిన లెక్కలప్రకారమే రూ.1472కోట్లు అవుతోంది. రాష్ట్రంలోని ఇసుక రీచ్ లు పొందిన జేపీ కనస్ట్రక్షన్స్ వారు ఏటా ప్రభుత్వానికి కట్టాల్సింది రూ.765కోట్లు అయితే, ప్రభుత్వం నిర్మించేఇళ్లకు అవసరమైన ఇసుకతాలూక సొమ్ములో రూ.1472కోట్లలో, రూ.765కోట్లుపోతే, మిగిలినమొత్తాన్ని ప్రభుత్వమే సదరు సంస్థకు చెల్లిస్తుందన్నారు.

కృష్ణానదిలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వారుచేపట్టిన పూడికతీతలో కోటి20లక్షల టన్నుల ఇసుక లభ్యమవుతోంది. ప్రభుత్వం ఆ విధంగా డ్రెడ్జింగ్ చేయడంద్వారా వచ్చిన ఇసుకను కూడా జేపీ సంస్థకే ఇచ్చేస్తామనిచెబుతున్నారు. కోటి20లక్షలటన్నులఇసుకను బయటకు తీయడానికి ఇరిగేషన్ శాఖే డబ్బులుచెల్లిస్తుందని, దానివిలువ సుమారు రూ.570కోట్లవర కు ఉంది. ఆ మొత్తంఇసుకను కూడా జేపీ సంస్థకు ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకొచ్చిందో, దానివెనకున్న మతలబేమిటో తెలియదు. నిర్మాణ అవసరాలకు తమకు లక్షా60వేలటన్నుల వరకు ఇసుకకావాలని ప్రజలు ఆన్ లైన్లో బుక్ చేసుకున్నారు. దానికి సంబంధించి రూ.10కోట్లవరకు చెల్లింపులు కూడా చేశారు.

ఈ ఇసుక బుకింగ్ లు, ప్రభుత్వం రాష్ట్రంలోని ఇసుకరీచ్ లను జేపీసంస్థకు అప్పగించడానికి ముందు జరిగినవి. ప్రజలు బుక్ చేసుకున్నఇసుకను, వారి తాలూకాసొమ్ముని కానీ ఈప్రభుత్వం ఇంతవరకు తిరిగి చెల్లించ లేదు. రాష్ట్రంలోని ఇసుకరీచ్ లను ప్రభుత్వం జేపీసంస్థకు అప్పగించేనాటికి (12-05-2021కి ) 14.35లక్షల టన్నులఇసుక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇసుక డంపింగ్ యార్డ్ ల్లో నిల్వఉంది. దానివిలువ సుమారుగా రూ.70కోట్లవరకు ఉంది. ఆమొత్తం తాలూకా సొమ్ములో రూపాయి ని కూడా జేపీసంస్థ, ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి తిరిగిచెల్లించలేదని మైనింగ్ శాఖవారిచ్చిన సమాచారంలో ఉంది.

ప్రజల సొమ్ము, రూ.10కోట్లు, యార్డ్ ల్లో నిల్వఉన్న ఇసుకతాలూకా రూ.70కోట్లు, డ్రెడ్జింగ్ ఇసుక తాలూకా రూ.570కోట్ల సొమ్మంతా జేపీపరం చేయడంలోని మతలబు ఏమిటని, సదరుకంపెనీపై పాలకులకు అంతప్రేమ ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సదరుకంపెనీ ప్రభుత్వానికి రూ.765కోట్లుమాత్రమే కట్టడమేమిటి.. ప్రభుత్వం మాత్రం రూ.7నుంచి రూ.8వేలకోట్ల విలువైనఇసుకను ఆకంపెనీపరం చేయడమేంటి? ప్రభుత్వం సమాచారహక్కుచట్టంకింద ఇచ్చిన సమాచారంలోనే పాలకుల ఇసుకదోపిడీ సుస్పష్టంగా కనిపిస్తున్నా, ఎవరూ ప్రశ్నించకూడదా?

రాష్ట్రంలోని రీచ్ లన్నింటినుంచీ రాష్ట్రంలోని నలుమూలలకు, ఇతరరాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుకనుంచి రోజుకి రూ.20కోట్లచొప్పున, నెలకు రూ.600కోట్లవరకు, సంవత్సరానికి రూ.7వేలకోట్లవరకు ఈ ప్రభుత్వం దోచుకుంటోంది. ప్రజలపై ఏదోపెద్దప్రేమ ఉందని చెప్పే జగన్మోహన్ రెడ్డి, ఇసుక అమ్మకాలు, రవాణాలోని అసలు ఆంతర్యాన్ని బయటపెట్టాలి. టీడీపీప్రభుత్వంలో ఉచితంగా నే ఇసుక అందించడం జరిగింది. ఇసుకను ఎక్కువగా వినియోగించేదిపేదలే. డబ్బున్నవా రు ప్రభుత్వం నిర్ణయించినధరకంటే అధికంగా వెచ్చించైనా కొనుక్కోగలరు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు డబ్బులుకట్టినాకూడా, సామాన్యులకు ఎమ్మెల్యేల సిఫార్సు లేకుండా ఇసుక దొరకని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి జన్మదినంనేడు. ఆ సందర్భాన్ని పురస్క రించుకొని ఆయనభక్తులు కోట్లరూపాయలతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రిగారు ఉచిత ఇసుకవిధానాన్ని అమలుచేయాలని టీడీపీతరుపున విజ్ఞప్తిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని గెలిపించినందుకు చివరకు ప్రజలకు ఇసుక దొరకని దుస్థితి. సామాన్యులు, పేదలు, మధ్యతరగతివారు ఇంట్లో ఏ చిన్ననిర్మాణపని చేయాలన్నా, దానికి అవసరమైన ఇసుకకోసం ఎమ్మెల్యేలు, వారి పీఏల అనుమతులు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. మద్యంసహా, అన్నింటిపై ఇష్టానుసారం ధరలుపెంచిన ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఉచితఇసుకవిధానం అమలుచేయాలని కోరుతున్నాం.

ఆయన నిజంగా ఆపనిచేస్తే చాలాగొప్ప మేలుచేసినవాడవుతాడు. ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయం బాధ్యతలను జేపీ సంస్థ చేపట్టేనాటికి రాష్ట్రంలోని 14లక్షల35వేల619మెట్రిక్ టన్నులఇసుక నిల్వలు డంపింగ్ యార్డ్ ల్లో ఉన్నాయని, ఆ ఇసుక నిల్వలకు సంబంధించిన సొమ్ముని జేపీసంస్థనుంచి వసూలుచేయవల్సి ఉందని ఏపీఎండీసీ వారే నవంబర్ 15న సమాచారహక్కుచట్టం కింద అడిగినప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

జేపీ సంస్థకు ఇసుక రీచ్ లనిర్వహణలో మిగిలేది కేవలం రూ.72కోట్లేనని కూడా గోపాలకృష్ణద్వివేదీ చెబుతున్నారు.జేపీ సంస్థ శేఖర్ రెడ్డి తమి ళనాడులో నదులు, సముద్రాలు కూడా వదల్లేదు. అలాంటివ్యక్తికి ఇంతమొత్తమే ఆదాయం వస్తుందని ప్రభుత్వంలోని అధికారి ఎలా చెబుతారు? ఇసుకపాలసీపై దాదాపు 35వేలవరకు ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజలు బుక్ చేసుకున్నతాలూకా ప్రభుత్వం వారికి రూ.10కోట్లవరకు చెల్లించాల్సి ఉంటే, అదిఇంతవరకు చెల్లించలేదు. ఎవరుఎలాపోయినా, ఏది ఏమైనా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి, రాష్ట్రపౌరుడిగా ఉచిత ఇసుక విధానం అమలుచేయమని కోరుతున్నా.

LEAVE A RESPONSE