Suryaa.co.in

Andhra Pradesh

పల్నాడు జిల్లాలో వైకాపా క్లీన్ స్వీప్

రాష్ట్రంలో 151 పైగా స్థానాలు ఖాయం
ఎరుపు రంగులోకి పచ్చ పార్టీ
పచ్చ పతనాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాషాయంలో ఉన్న పచ్చ బ్యాచ్
చంద్రబాబు పిచ్చి పీక్స్ కు చేరింది
హత్యా రాజకీయాలకు టీడీపీ పెట్టింది పేరు
చంద్రయాన్ విజయాన్ని చంద్రబాబు విజయంగా భావించి సంబరాలు చేసుకుంటున్న తేదేపా
ఎంపీ విజయసాయిరెడ్డి

నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా 2024 ఎన్నికల్లో వైకాపా కైవసం చేసుకుంటుందని దక్షిణ కోస్తా జిల్లాల వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పల్నాడులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో నాయకులందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారని, పార్టీ పటిష్ట స్థితిలో ఉందని అన్నారు.

ఇటీవల టైమ్స్ నౌ, ఇండియా టుడే వంటి జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వైకాపా 2024 ఎన్నికల్లో 24 నుంచి 25 పార్లమొంట్ స్థానాల్లో గెలుస్తుందని వెల్లడైందని, ఈ లెక్కన 175 అసెంబ్లీ స్థానాలకు 175 కూడా వైకాపా గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గత ఎన్నికల్లో వచ్చిన 151 స్థానాలకు మించి 2024 ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని అన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ సమావేశాలు కొనసాగుతాయని, ప్రతి నియోజకవర్గం, మండల స్థాయి, క్షేత్ర స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రజలకు మరింత సమర్దవంతంగా సేవలందించే లక్ష్యంతో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారధులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

చంద్రయాన్ విజయాన్ని దేశ ప్రజలందరూ పండగ చేసుకుంటే అందులో చంద్రబాబు పేరుందని తెలుగుదేశం పార్టీ వారు పండగ చేసుకుంటున్నారని, చంద్రయాన్ విజయం సాధించినట్లుగానే చంద్రబాబు విజయం సాధిస్తాడని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పచ్చ పార్టీ ప్రస్తుతం ఎరుపు రంగులో (డేంజర్ జోన్) ఉందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే తంతాం. పొడుస్తాం, చంపుతాం, గుడ్డలు ఉడదీస్తాం, ఉచ్చపోయిస్తాం అంటూ చంద్రబాబు, లోకేష్ లు తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఇటువంటి పదజాలాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు.

టీడీపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఎర్ర బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వస్తే అంతుచూస్తానని లోకేష్‌ మాట్లాడుతున్నాడని అన్నారు. అటువంటి కుతూహలమే ఉంటే హెరిటేజ్ మాదిరిగానే సులభ్ కాంప్లెక్స్ లు పెట్టి వ్యాపారం చేసుకోవాలని చంద్రబాబు, లోకేష్ లకు సూచించారు. వైకాపా అంటే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్), అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న పార్టీ అని అన్నారు. అయితే తేదేపా అంటే జీపీటీ (గెలిస్తే తంతాం) అనేలా చంద్రబాబు, లోకేష్‌ లు వ్యవహరించడం సిగ్గుచెటన్నారు.

హత్యారాజకీయాలకు తేదేపా పెట్టింది పేరని, కాపుల ఆరాధ్యదైవం వంగవీటి రంగాను, జర్నలిస్టు పింగళి దశరథ్, తదితరులను హత్య చేసింది చేసింది తేదేపా వారు కాదా అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నవాళ్లంతా సంఘ వ్యతిరేక శక్తులేనని అన్నారు. వాళ్లు హంతకులమని వారే ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ఆ పార్టీ నాయకుడే పెద్ద గూండా అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే మొదట రుషికొండలో బిల్డింగ్ కొట్టేస్తామని చెబుతున్నాడని, అవి ప్రజల డబ్బుతో కట్టిన ప్రభుత్వ భవనాలని, ఎందుకు లోకేష్ కొట్టాలని అనుకుంటున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

విజయవాడలో యువగళం ముగించుకొని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో సడన్ గా లేచానని,లోకేష్ చెప్పుకోవడం విఠలాచార్య సినిమాను తలపిస్తుందని అన్నారు. తాను కార్ ఇంజన్ కనిపెట్టానని, స్టాన్ ఫోర్డ్ లో చదివానని లోకేష్, సెల్ ఫోన్ కనిపెట్టానని, సోలార్ ఎనర్జీ కనిపెట్టానని చంద్రబాబు బిల్డప్పులు ఇస్తున్నారని అన్నారు.

అలాగే అందరికీ తావీద్ పంపిస్తున్నానని, అది కట్టుకుంటే కష్టాలు తీరిపోతాయని, తాను భగవంతుడికి అనుసంధాన కర్తనని చంద్రబాబు చెబుతుండడం చూస్తూ అతని పిచ్చి పీక్స్ చేరినట్టు అర్థమవుతుందని అన్నారు. సాధించిన వారు ఎవ్వరూ బయటకు చెప్పుకోరని, పిరికివాళ్ళు మాత్రమే ఎగిరెగిరి పడుతుంటారని, ఇతరులకు దూషిస్తారని అన్నారు.

14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, మంత్రిగా పనిచేసిన లోకేష్ లు తీవ్రమైన అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని, అసూయ,ద్వేషంతో రగిలిపోతూ ఇలా మాట్లాడుతున్నారని ఇది ఖచ్చితంగా మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ అని అన్నారు. చంద్రబాబు చెబుతున్న విజన్ 2047 నుండి కాపీ కొట్టాడని ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు 2047 లో ఏ పరిస్థితిలో ఉంటాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

పచ్చ పార్టీ పతనమైపోతుందంటే, కషాయంలో ఉన్న పచ్చ బ్యాచ్జీ ర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సమావేశాల్లో చంద్రబాబు చదివిన స్కిట్ నే బీజేపీలో ఉన్న పురందరేశ్వరి, సుజనా చౌదరి, సీపీఐ నారాయణ చదువుతున్నారని అన్నారు. పొదిగేది ఎక్కడైనా పిల్లలు మాత్రం అవేనని అన్నారు.

రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశం చంద్రబాబు, లోకేష్‌ లను లేదని, వారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకులని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్న తీరు చేస్తూ రాష్ట్రంపై వారికున్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోందని అన్నారు. వారు ఎల్లప్పుడూ బ్రాంతిలో ఉంటారని, ఏ విషయంపైనా వారికి అవగాహన ఉండదని, చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్రానికి పట్టిన అరిష్టం అని, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉండడం రాష్ట్రానికి దురదృష్టం అని అన్నారు.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వైకాపా జయకేతనం ఎగురవేసిందని అన్నారు. కుప్పంలోనూ 5 స్థానాలు గెలుచుకుందని, చంద్రబాబు సొంత ఇళ్లు ఉన్న వార్డులోనూ వైకాపా విజయం సాధించిందని అన్నారు. చంద్రబాబు ఏమి చేశాడని ప్రజలు గెలిపించాలని కోరుకుంటారని అన్నారు.

అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చంద్రబాబు, లోకేష్ లు 2024లోనే కాదు 2029, 2034లోనూ అధికారంలోకి రాలేరని అన్నారు. అయ్యన్నపాత్రుడు మద్యం మత్తులో ఉంటూ అసభ్యకరమైన భాష మాట్లాడుతన్నాడని, ముఖ్యమంత్రిపైనా తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నాడని అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడి సంవత్సరం పాటు విశాఖ రాకుండా దాక్కున్నాడని, అంతటి భయస్తుడని అన్నారు.

గతంలో ఇదే విధంగా మాట్లాడితే మూల్యం చెల్లించుకున్నాడని, ఇప్పడు కూడా అదే జరగవచ్చని అన్నారు. చిలకలూరిపేట సమావేశం జరిగినప్పుడు తనతో పాటు మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి సుమారు గంటన్నర పాటు చర్చించామని, దానికి ఈనాడు పత్రిక ఏవోవో ఊహించుకొని ఇష్టం వచ్చినట్లు రాసిందని అన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీ పరిస్థితి అద్భుతంగా ఉందని, అందరూ కలిసి పని చేస్తున్నారని అన్నారు.

సజ్జల భార్గవ సారధ్యంలో పార్టీ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు. పార్టీ అభ్యర్థి ఎవరైనా వారి విజయం కోసం పని చేయాల్సిన బాధ్యత రీజనల్ కోఆర్డినేటర్ దని అన్నారు. పార్టీ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. అలాగే ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని అన్నారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సోమవారం సమావేశం కానున్నామని, తెలుగుదేశం పార్టీ ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారన్నది తాము నిరూపిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి,ఎంపి లాపు శ్రీకృష్ణదేవరాయలు,ఎమ్మెల్యేలు నంబూరి శంకర్రావు, బోల్ల బ్రహ్మనాయుడు,మండలి చిప్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE