Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు

– వైసీపీ-టీడీపీ కుటుంబపార్టీలే
– రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం
– జనసేనతో పొత్తు ఉంటుంది
– బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

భీమవరం : 2014 తర్వాత వచ్చిన టిడిపి, వైసిపి ప్రభుత్వం ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేశాయి. అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేశాయి.కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటిలో తమ స్టిక్కర్లను చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు.. ఆంధ్రప్రదేశ్లో వైసిపి, టిడిపి పార్టీలు రెండు కూడా కుటుంబ పార్టీలే అవినీతి చేసిన పార్టీలే.. వీటికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం.

నరేంద్ర మోడీ చేసే అభివృద్ధిని ఆధారంగా రాష్ట్రంలో బలపడాలని స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వైసిపి పూర్తిగా వైపల్యం చెందిందని ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విసిగిపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని స్పష్టంగా చెబుతున్నాం. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలతో సమానంగా, గత ప్రభుత్వం టిడిపి కూడా వలగాపెట్టింది ఏమీ లేదు.
బిజెపిని రాష్ట్రంలో ఎదగనీయకుండా చూస్తే , ఈసారి భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో బిజెపి కచ్చితంగా డబల్ ఇంజన్ సర్కార్ తేవడానికి, ఏ విధంగా తగ్గకుండా పూర్తిస్థాయిలో అధికారంలోకి రావడానికి కార్యాచరణ చేస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ లో జనసేనపార్టీ తో బిజెపి పొత్తులో ఉంది. ఇప్పుడు చేయవలసింది ఏముంది ఏమీ లేదు. బిజెపిపై దుష్ప్రచారం చేసి ప్రజల్లో చెడు చేద్దాం అన్నటువంటి తప్పుడు విధానాల అవలంబిస్తే, అంతకు అంతా అనుభవించక తప్పదు..

LEAVE A RESPONSE