Suryaa.co.in

Andhra Pradesh

మంత్రులు బిజెపి వెంటపడతారంట !

– పడాలి.. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి

nadda-1బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆంధ్ర రాష్ట్ర రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజమండ్రి బహిరంగ సభలో.. జగన్ పోవాలి బిజెపి రావాలి అనే నినాదంతో ప్రజలను ఉత్తేజపరిచి ఉర్రూతలూగించారు . ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచక, అప్పుల పాలనను ఎండ గట్టారు.అది తట్టుకోలేని వైసీపీ ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు.. మేము కూడా బిజెపి చేస్తున్న పరిపాలనను విమర్శిస్తాం, కేంద్ర ప్రభుత్వం వెంటపడతాం అని అంటున్నారు. సంతోషం. స్వాగతం. మీరు ఎంత విమర్శిస్తే దానికి వందరెట్లు గా మా దగ్గర సమాధానం ఉంది. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ఈ విధంగానైనా ప్రజలకు తెలియజేసే ఒక అవకాశం పార్టీకి దొరుకుతుంది. బహిరంగ చర్చకు సిద్ధమా! లేదా సోషల్ మీడియాలో మాట్లాడుకుందామా ! పేపర్ ప్రకటన లో ఏమీ తేలదు. మీడియా ముందుకు మీరు రండి, మేము వస్తాం. మీ సొంత ఛానల్స్ అయినా పర్వాలేదు. ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే దానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఎలాగైనా సరే మీరు చేసిన ,చేస్తున్న అభివృద్ధి నిరోధకాన్నంత ప్రజలకు తెలియజేసే అవకాశం కలిగింది.

మోడీ ఈ రాష్ట్రానికి చేసిన మేలును, అభివృద్ధిని చెప్పుకోవాలంటే గంటలు గంటలు, పేజీలు పేజీలు చెప్పుకోవాలి . కానీ మాట వచ్చింది కాబట్టి, నేను కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు ఒక్కొక్క లబ్ధిదారునికి ఉచితంగా గా లక్షా ఎనభై వేల రూపాయలు కేటాయిస్తే , మీరు ఎన్ని ఇళ్లు కట్టారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్దీ మోడీదే.

సిమెంట్ రోడ్లు ,మరుగుదొడ్లు, సిమెంట్ కాలవలు, నరేగా నిధులు , నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు, రైతు భరోసా కేంద్రాల బిల్డింగులు ,రైతులకు డబ్బులు, నెల నెల పేదలకు ఇచ్చే బియ్యం ,బాలింతలకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం, సర్వ శిక్ష అభియాన్ కింద జరిగే సంక్షేమం ,హైవే రోడ్ లు, రైల్వే ప్రాజెక్టులు, పోలవరం డబ్బులు ,సీ పోర్టులు ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ గారు పెట్టిన పథకాలు 120 వరకు ఉన్నాయి. కాబట్టి మీరు దేని మీద చర్చకు వస్తారో కమాన్ రండి. ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దాం .

ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మైను, వైను, సిమెంటు, సాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వ్యాపారాలన్ని డైరెక్టుగా (సింగిల్ విండో పద్దతిలో) ముఖ్యమంత్రికే సంబంధం. ఇంకా ఎవరికీ సంబంధం లేదు .ఈ విషయం మీద వాళ్ల పార్టీ ఎం ఎల్ ఏ,నాయకులే మాట్లడుకుంటుంటారు. నియోజకవర్గాలలో, జిల్లాలలో మన నోటికి ఏమీ అందడం లేదే అని బాధ పడుతున్నారు. చర్చకు రండి మాట్లాడుకుందాం .ఎవరు దేశం కోసం, ప్రజల కోసం చేస్తున్నారో, ఎవరు వారు తిరిగి అధికారంలోకి రావడం కోసం చేస్తున్నారో ప్రజలు నిర్ణయం చేస్తారు .

– కరణం భాస్కర్
బిజెపి,
7386128877 .

LEAVE A RESPONSE