-అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణం చేసినంతమాత్రాన ఆయన చేసిన దోపిడీ మాయమవుతుందా? సీబీఐవిచారణ జరిపించుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి
-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఒక దళితుడు, ఇద్దరు ముస్లిం యువకుల్ని దారుణంగా చంపిన ఎస్ ఐ కరిముల్లాను మంత్రి రక్షించడాన్ని ఏమనాలి? హత్యలుచేసేవారిని రక్షించేవారు వారికంటే పెద్దనేరస్తులు. గతంలో కావలిలో కరుణాకర్ చావుకి కారణమైన సురేశ్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలను ఒడిశావెళ్లి అరెస్ట్ చేసిన ఎస్.ఐ ఖాజావలిని మంత్రి వీఆర్ కు పంపించాడు.
నిజాయితీగా పనిచేసిన ఖాజావలిని వీ.ఆర్.కు పంపించి, అమాయకుల్ని చంపిన కరిముల్లాకు అండగా నిలుస్తారా?జగన్ ప్రభుత్వంలో ఐపీసీ స్థానంలో వైసీపీసీ నడుస్తోంది. ఉదయగిరి నారాయణ హత్యకేసులో అమాయకుల్ని చంపిన ఎస్.ఐని రక్షిస్తున్న మంత్రి ఏ1 అయితే, శవాన్ని 40మంది పోలీసులతో దహనంచేయించిన జిల్లాఎస్పీ ఏ2, పోస్ట్ మార్టమ్ నివేదిక తారుమారుచేయించిన వైద్యుడు ఏ3, ఎస్.ఐ ఏ4లు.
ఉదయగిరి నారాయణ మృతిపై టీడీపీ జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదుచేస్తే, కమిషన్ ఎన్నిసార్లు కోరినా జిల్లాఎస్పీ, కలెక్టర్ స్పందించలేదు. ఆగ్రహించిన కమిషన్ ఆగస్ట్ 25న జిల్లాఎస్పీ, కలెక్టర్ ఆధారాలతో తమముందు విచారణకు రావాలని ఆదేశించింది. అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణం చేసినంతమాత్రాన ఆయన చేసిన దోపిడీ మాయమవుతుందా? మంత్రి, మాజీమంత్రి అవినీతిని లోకేశ్ బాబు ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఉత్తుత్తి ప్రమాణాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయకుండా, జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి సీబీఐవిచారణ జరిపించుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి.