– ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో వైసీపీ అలజడులు
– మీ దుష్టచర్యలతో ఏపీలో పెట్టుబడులకు ఎస్.ఆర్.ఐ.లు వెనుకంజ
– ఎస్.ఆర్.ఐ. టీడీపీ సౌతాఫ్రికా అధ్యక్షులు, పారా రామకృష్ణ
స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ వంటి వాటిని సాధించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడితే ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించేవారు. కాని అలా కాకుండా ఓ తుగ్లక్ నిర్ణయాన్ని సమర్ధించేందుకు రాజీనామాల పేరుతో రాక్షస రాజకీయం చేస్తున్నారు.
మూడు రాజధానులు అంటున్న జగన్ రెడ్డి.. మూడు ప్రాంతాల్లో మూడున్నరేళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క ఇటుక అయినా వేశారా?ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. ఆఖరికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్ట్ ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారిని వేయలేదంటే ఇదా వైసీపీ నాయకులకు ఉత్తరాంధ్ర మీద ఉన్న ప్రేమ? ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు అలజడులు సృష్టిస్తున్నారు. మీ దుష్టచర్యలతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు ఎన్ఆరలు వెనక్కి వెళ్లిపోతున్నారు. కేవలం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టానికి ఉత్తరాంధ్ర జేఏసీని ఏర్పాటు చేశారు. మూడు రాజధానులు సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది.
రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్రానికి లేదని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి అడిగిన ప్రశ్నతో తేటతెల్లమైనా మూడు రాజధానులంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు. అమరావతే రాజధాని అని ప్రస్తుత ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నికల ముందు చెప్పారు.విశాఖ రాజధానిగా వస్తుందని అప్పుడెందుకు చెప్పలేదు? జగన్ రెడ్డి ఇక్కడే ఇళ్లు కూడా కట్టుకున్నా అని అమరావతి ప్రాంత ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతుల్ని ద్రోహులు, చోరులు అంటూ తీవ్ర పదజాలంతో చూపిస్తున్నారు.