Suryaa.co.in

Andhra Pradesh

నిన్న తిరుపతి రుయా.. నేడు విశాఖపట్నం

ప్రభుత్వ ఆస్పత్రుల ముందు రాక్షసులు అంబులెన్స్ డ్రైవర్ల రూపంలో దర్శనమిస్తున్నారు.నిన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్సుల అరాచకాన్ని మరువకముందే ఇప్పుడు విశాఖలోని కేజీహెచ్ ఘటన వెలుగులోకి వచ్చింది.వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పెనుగొల్లుకు చెందిన ఓ బాలింత బిడ్డకు జన్మనిచ్చింది.ఆమె భర్త మనోజ్ భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రైవేట్ వాహనాన్ని తీసుకొచ్చాడు.భార్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్, వాచ్‌మెన్‌లు దాడి చేశారు.మనోజ్‌ను రక్తం కారేలా కొట్టారు.సొంత వాహనం ఉందని, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అవసరం లేదని చెప్పినందుకు ఇలా దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.అవసరం ఉన్నా, లేకున్నా డబ్బులు కట్టాల్సిందేనని దాడులు చేస్తున్నారు.అంతేకాకుండా ఆస్పత్రి అంతా లంచాలమయంగా మారిందని బాధితులు తెలిపారు.ఈ ఘటనపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసి బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

LEAVE A RESPONSE