Suryaa.co.in

Features

భక్తి పట్ల నిర్లక్ష్యం… అసలు నేరస్తుడివి నువ్వే

భక్తి పట్ల నిర్లక్ష్యం

వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి
బూడిద కాస్తా మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే
ఏం చేశాం..??
కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే ఏం చేశాం?

శ్రీ రాముని తల కావాలని తెగ్గొడితే ఏం చేశాం?
విఘేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే..ఏం చేశాం?
శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే ఏం చేశాం?
దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది
హుండీలో నువ్వు వేసే డబ్బుకట్టల రూపంలో కాదు.
నీ నమ్మకానికి హాని జరిగితే ప్రశించలేని నీకు
దణ్ణం పెట్టే అర్హత కూడా లేనట్టే..
మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన
అసలు నేరస్తుడివి నువ్వే.

– సీహెచ్. నాగరాజు

LEAVE A RESPONSE