Home » నా ఎదుగుదలకు కారణం మీరే

నా ఎదుగుదలకు కారణం మీరే

– కార్యకర్తల సమావేశంలో పల్లా

గాజువాక: నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయికి చేరుకున్న తన రాజకీయ ప్రయాణంలో తన ఉన్నతికి కారణం కార్యకర్తలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం గాజువాకలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా తనపై విశ్వాసంతో తన వెన్నంటి ఉండి ఇంతటి ఘన విజయాన్ని సాధించటంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతీ కార్యకర్తకు రుణపడి ఉంటానని అన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాలను చూడాల్సిన బాధ్యత తనపై ఉన్నందున నాయకులు,కార్యకర్తలు తమవద్దకు వివిధ పనులపై వచ్చేవారికి పార్టీలకతీతంగా తన మన బేధాలు చూడకుండా పనులను చేయటం ద్వారా వారి మన్ననలను కూడా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు,సీనియర్ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply