– ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానాలు బలహీనం
– కేసీఆర్ పై నమ్మకమున్నప్పుడు నోటీసులు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకే రావాలికదా.?
– రేవంత్ రెడ్డి ఇంటికేందుకెళ్లినారో ?!
– పిరాయింపు ఎమ్మెల్యేల కుంటి సాకులపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట: ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయి.స్పీకర్ కు సమాధానంలో పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటు.రేవంత్ ను కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే నమ్ముతారా?
రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు. జాతీయ జెండా అని చెప్పడం హాస్యాస్పదం.. జాతీయ జెండాను అవహేళన చేయడం సరికారు. దొంగతనం చేసి తప్పించుకోలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇప్పటికే పార్టీ విశ్వాసం కోల్పోయిండ్రు.. నమ్మిన పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ప్రజలు క్షమించరు. కోట్లాది మంది ప్రజలకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు..కెసిఆర్ పై నమ్మకమున్నప్పుడు నోటీసులు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకే రావాలికదా.? రేవంత్ రెడ్డి ఇంటికేందుకెళ్లినారో సరైన సమాధానం చెబుతారా?
ఇచ్చిన గడువు లోపు స్పీకర్ కు సమాధానం ఇస్తాం.ప్రజల ముందు అడ్డంగా దొరికిన దొంగలు వీళ్లు.ఎవరో కాపాడుతారానుకుంటేఅది వాళ్ళ తెలివి తక్కువ తనమే.రేవంతే కాదు.. వీళ్ళను ఇంకా ఎవరూ కాపాడలేరు.వాళ్ళను డిస్కాలిఫై చేయడం ఖాయం. ఉప ఎన్నికలు రావడం.. ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. మిమ్మల్ని రాజకీయంగా శాశ్వతంగా బొంద పెడతారు.