-క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల బాధ ఏంటో అర్థం అవుతుంది
-దెబ్బతిన్న, మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన తేదేపా నేత దేవినేని ఉమా
-చేల గట్లపై కూర్చుని రైతుల ఆవేదన, బాధ విన్న ఉమా
-చేతికొచ్చిన ధాన్యం తో పాటు, కూరగాయల పంటలు, వాణిజ్య పంటలు అన్ని దెబ్బతిన్నా ముఖ్యమంత్రి లో చలనం లేదు
-ప్రకృతి విపత్తు వల్ల కొంత నష్టం జరిగితే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల రైతులకు భారీ నష్టం జరిగింది. ఈ నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు
-రైతుల ఇబ్బందులు పట్టించుకోని నీవు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా?
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం: విజయవాడ రూరల్ మండలం షాబాద్, జక్కంపూడి, గొల్లపూడి ప్రాంతాలలో దెబ్బతిన్న, మునిగిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అంటూ ప్రశ్నించారు తక్షణమే తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి కొంపలో కూర్చుంటే రైతుల కష్టాలు కనపడవు ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల బాధ ఏంటో అర్థం అవుతుంది. ప్రకృతి విపత్తు వల్ల కొంత నష్టం జరిగితే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల రైతులకు భారీ నష్టం జరిగింది. తుఫాను పోయి వారం రోజులైనా మెట్ట పొలాలలో నీరు బయటకు వెళ్లలేదంటే ఇది యంత్రాంగం అసమర్థత కాదా? వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలను నిర్వీర్యం చేశారు
తాడేపల్లి రాజప్రసాదానికి కూత వేటు దూరంలో ఉన్న పొలాలను సైతం పరిశీలించలేదు. రైతులు ఇబ్బందులు పట్టించుకోని నీవు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? తడిసిన మొలకెత్తిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు. రైతు భరోసా కేంద్రాలు వెళ్తే మిల్లర్లు కొనుగోలు చేస్తారు అంటూ చేతులు దులుపుకున్నాయి. మిల్లర్లు మాకు ఆదేశాలు రావడం లేదు రాలేదు మేము కొనుగోలు చేయమంటున్నారు. దళారీలు వైసీపీ నేతలు రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు.
మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగిన ఈ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు. ముఖ్యమంత్రి 20 కిలోమీటర్ల ప్రయాణించడానికి తెచ్చుకునే హెలికాప్టర్ 200 కిలోమీటర్ల నుండి తెప్పించాలా? 400 కిలోమీటర్లకి ప్రజాధనం వృధా చేసే హక్కు మీకు ఎక్కడిది? ఫోటో ఎగ్జిబిషన్లతో వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు రైతు కష్టం తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు నర్రా వాసు, వడ్లమూడి చలపతిరావు, జాలిపర్తి గోపాలకృష్ణ, పసుపులేటి జమలయ్య, రాయిడి శ్రీనివాసరావు,గంధం సుబ్బారావు, మాధవరావు మేడూరి నరేంద్ర గ్రామ, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.