మంగళగిరి: ఓ పెళ్లివేడుకలో పాల్గొనేందుకు వెళ్లి తిరిగివస్తూ తక్కెళ్లపాడు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మంగళగిరి 4వవార్డుకు చెందిన గార్లపాటి సుబ్బమ్మ (50), గార్లపాటి శ్యామ్ (6), గార్లపాటి పావని (19) మృతిచెందడంపై టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు యువనేత లోకేష్ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన గార్లపాటి నాగలక్ష్మి (38), డ్రైవర్ శ్రీకాంత్ (31)లకు మెరుగైన వైద్యసాయం అందించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.