వీటిని ఎక్కువగా లైంగిక జీతంలో ఉపయోగిస్తారు. HIV-AIDS వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు కొందరు వీటిని వాడితే.. మరికొందరేమో భార్యభర్తలు మాత్రం పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొందరు కుర్రాళ్లు మాత్రం వీటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు కానీ.. వాటిని శృంగారం కోసం వాడటం లేదు. మరి వాటితో ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారా? వాటితో యువకులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు. ఎందుకంటే.. కొందరు యువకులు కండోమ్‌లను నీటిలో నానబెట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారు. తర్వాత ఆ నీళ్లను తాగేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. కాగా.. యువకులు ఈ పని ఎందుకు చేస్తున్నారనే పూర్తి వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన సామాన్య యువకులు, విద్యార్థులు స్థానిక మెడికల్ షాప్‌లలో విపరీతంగా కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కండోమ్‌లను వేడి నీటిలో రాత్రంతా నానబెడుతున్నారు. తర్వాత కండోమ్‌లను పాడేసి.. ఆ నీళ్లను తాగి, మత్తులో తూగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో కొందరు నిపుణులు స్పందిస్తూ.. కండోమ్‌లను సుమారు 5-6 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీళ్లకు ఆల్కహాలిక్ స్వాభావం వస్తుందని చెబుతున్నారు. కాగా.. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. కాలేజీ స్టూడెంట్లు ఈ నీటికి బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజీలు ఉపయోగించి మరీ పెద్ద మొత్తంలో కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు.