– వైయస్ జగన్ తన పాలనతో నిశ్శబ్ధ విప్లవాన్ని తీసుకువచ్చారు
– ప్రజాధనాన్ని దోచుకుని సత్యాగ్రహ దీక్షలేంటి
– మహాత్ముడిని అవమనించే రీతిలో చంద్రబాబు దీక్షలు ఉన్నాయి
– ఆధారాలు దొరికితేనే ఏసిబి కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది
– గాంధీ జయంతి రోజున ఉదాత్తమైన లక్ష్యాల కోసం దీక్షలు చేయవచ్చు
– కానీ ఒక అవినీతి పరుడు అడ్డంగా బుక్కై బరితెగింపుతో దీక్షలేంటి
– చంద్రబాబుకు కొందరు జోకర్లు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు
– చంద్రబాబుకు మధ్ధతు ఇస్తున్న వారి వ్యవహారం ఎలా ఉందంటే వైయస్ జగన్ ను అర్జెంటుగా సిఎం పదవి నుంచి దింపి చంద్రబాబును కూర్చోబెట్టాలేది కనిపిస్తోంది
– రిటైరైనవారు పెట్టే వేదికలు కాకుండా నిజమైన మేధావులు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి
– తన పాలన వల్ల మేలు జరిగితేనే తనకు మద్దతు ఇవ్వమని జగన్ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు
-ప్రభుత్వ సలహాదారులు పార్టీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
ఘనంగా మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాట సాధనలో ఆ మహనీయులు చేసిన త్యాగాలను,పోరాటాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పూల మాలలు వేసి పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి,రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,ఎంపీ నందిగమ సురేష్, మాజి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎం ఎల్ సి లు లేళ్ళ అప్పిరెడ్డి, ఎండి రుహుల్ల, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్,గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు,మాజీ మంత్రులు శిద్దా రాఘవరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ లు ఘన నివాళులు అర్పించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ, ఫూలే, అంబేద్కర్ లు భారతీయ ఆత్మ లాంటి వారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహాత్మాగాంధి ప్రపంచంలోనే అరుదైన మహానీయుల్లో ఒకరని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధి మరణించిన తర్వాత వారి ఆశయాలు, ఆచరణ గురించీ చర్చలు జరుగుతూనే ఉన్నాయని అయితే సమాజంలో అనుకున్నంత చైతన్యం ఉండటం లేదు. ప్రజాస్వామ్యం అన్న భావన అకడమిక్ అంశంగానే ఉండి పోతోందన్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే సిద్ధాంతాల పై చర్చే కానీ ఆచరణ జరగటం లేదు. అహింస, సహనం వంటివి ఉదాత్తమైన లక్షణాలు వాటిని చెప్పే ముందు మనం ఆచరించాలని…. వాస్తవ రూపంలో అది ఆచరించి చూపించటం వల్లే జాతిపిత మహాత్మాగాంధి మహానీయుడు అయ్యారని వివరించారు. లాల్ బహుదూర్ శాస్త్రి స్వాంతత్ర్యపోరాటంలో త్యాగాలు చేయడంతోపాటు విలువలతో కూడిన జీవితిం గడిపారన్నారు. రాజకీయాలలో ఆయన ఎందరికో మార్గదర్శకుడు అని అన్నారు.
మార్క్సిస్టు, గాంధీ సిద్ధాంతాలు చదివి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారని నేను అనను. కానీ వారి ఆశయాలను,ఆలోచనలను స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళుతున్నారని అంటాను. ప్రకటనలు….పై పై పూతలు కాకుండా కింది స్థాయి నుంచి మార్పులు తీసుకుని వస్తున్నారని అన్నారు.గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిపాలనను ఎలా అందిస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఫలితాలు ఎలా ఉన్నాయో అవి ఎంతగా సత్ఫలితాలు ఇస్తున్నాయో మనకు అర్థం అవుతున్నాయి అని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అడ్డంగా దొరికి జైలు ఊచలు లెక్కపెడుతున్న చంద్రబాబు సిగ్గు లేకుండా గాంధీ జయంతి రోజున నిరాహారదీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. మహాత్మాగాంధిని అవమానించే రీతిలో చంద్రబాబు దీక్షలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆధారసహితంగా దొరికిపోవడంతో ఆ సాక్ష్యాలను చూసి కోర్టు రిమాండ్ విధించిందని తెలియచేశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసి జైలులో దీక్షలు చేయడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు తప్పుచేసినట్లు కోర్టు గుర్తించిందని అందుకే రిమాండ్ కు పంపారన్నారు. అక్కడ దీక్షలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాటం చేసి జైలు కెల్తే వేరు ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా దోచుకుని సత్యాగ్రహదీక్షలు ఎలా చేస్తారని అన్నారు. దీక్షలు చేయడం చూస్తే చంద్రబాబుతో పాటు టిడిపినేతల్లో బరితెగింపు కనిపిస్తోంది అని అన్నారు.
గాంధీ కలలు గన్న గ్రామస్వరాజ్యం జగన్ గారి పాలనలో కనిపిస్తోందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 98 లక్షల సర్టిఫికెట్లు, సేవలు అందాయని అన్నారు. నేడు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోందని తెలియచేశారు. ఇవన్నీ గ్రామ,పట్టణ స్థాయిలో వేళ్ళూనుకున్న గ్రామ, వార్డు సచివాలయాల వల్లనే సాధ్యం అవుతోందన్నారు.
ఈ మొత్తం ప్రక్రియకు ఇరుసులాంటిది గ్రామ సచివాలయ వ్యవస్థ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు అవుతోందని….ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు సంబంధించిన గ్రామ హెల్త్ ప్రొఫైల్స్ కూడా తయారు అవుతున్నాయన్నారు. దీనివల్ల ప్రజలకు సంబందించిన ఆరోగ్యసేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు.15 మెడికల్ కాలేజీలు,ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ప్రజలకు మరింతగా వైద్యసేవలు లభిస్తాయన్నారు.
పెత్తందారితనం లేకుండా ప్రజాస్వామ్యస్పూర్తితో నడవాలంటే పధకాలు కిందిస్దాయి వరకు అందాలన్నారు.విద్యా,వైద్యరంగాలలో కార్పోరేట్ సంస్దలకు ధీటుగా మార్పులు తెచ్చిన ఘనత వైయస్ జగన్ గారిదన్నారు.నిరక్షరాస్యత రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.పేరుకు పాలన వైయస్సార్ సిపి దే అయినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల చేతుల్లోనే పాలన పెట్టారన్నారు.గడప వద్దకే పధకాలు అందిస్తున్నారన్నారు.వ్యవసాయరంగంలో కూడా రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేస్తున్నారన్నారు. వైయస్ జగన్ తన పరిపాలనతో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చారు అన్నారు.
రాష్ర్ట మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ….మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి లు దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తులు అన్నారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఆలోచనలను స్పరించుకుంటున్నామని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో మహాత్మాగాంధి కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారని అన్నారు.గ్రామాలను అభివృధ్ది చేయడం,పేదరికాన్ని పోగొట్టేవిధంగా పరిపాలన సాగిస్తున్నారని తెలియచేశారు.
రాష్ర్ట మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ…మహాత్మాగాంధి బ్రిటీష్ సామ్రాాజ్యాన్ని ఇక్కడ నుంచి పారద్రోలడంకోసం అనేక సంవత్సరాలు పోరాటాలు చేశారు.అహింసతో ఉద్యమం నడిపి తద్వారా విజయం సాధించారు. తద్వారా అహింస ద్వారా విజయాలు లభిస్తాయని మానవాళికి గొప్పసందేశం ఇచ్చారు. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా గాంధీజికి ఎంతో ప్రాముఖ్యత లభించిందని అన్నారు.మహాత్మాగాంధికి నివాళులు అర్పించడం భారతదేశంలో ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
శాసనమండలిలో ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..బ్రిటీష్ సామ్రాజ్యవాదులు ఎంతగా రెచ్చగొట్టినా కూడా మహాత్మాగాంధీ అహింసా మార్గంలోనే స్వాతంత్ర్య పోరాటం సాగించారని తెలియచేశారు. అహింసా అనే ఏకైక సిధ్దాంతంతో దేశానికి స్వాతంత్ర్యం లభించేలా చేశారన్నారు. వైయస్ జగన్ పేద,బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగాపనిచేస్తున్నారని అన్నారు.
ఎంపి నందిగమ్ సురేష్ మాట్లాడుతూ.. వైయస్ జగన్ గారు మహాత్మాగాంధీ కోరుకున్నవిధంగా గ్రామసచివాలయాల వ్యవస్ధను తీసుకువచ్చి ప్రజలకు మేలైన పరిపాలన అందిస్తున్నారన్నారు.గాంధీగారితో కలసి లాల్ బహుదూర్ శాస్ర్తి అనేక పోరాటాలు చేశారన్నారు.లాల్ బహుదూర్ శాస్ర్తి విలువల పాటిస్తూ త్యాగాలు చేస్తూ స్వాతంత్ర్యపోరాటం సాగించారన్నారు.అదే విధంగా డాక్టర్ అంబేద్కర్,జ్యోతిరావుపూలే,జగజ్జీవన్ రామ్ వంటి మహనీయులు కోరుకున్న విధంగా పేదరికాన్ని పోగొట్టి బడుగులకు రాజ్యాధికారంలో భాగం కల్పించిన ఘనత వైయస్ జగన్ రిదన్నారు.
మాజి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..మహాత్మాగాంధి,లాల్ బహుదూర్ శాస్ర్తి చూపిన పోరాట మార్గం అందరికి స్పూర్తి దాయకం అన్నారు. వైయస్ జగన్ వారు చూపిన బాటలో నడుస్తున్నారని తెలియచేశారు.
మాజి మంత్రి శిధ్దా రాఘవరావు మాట్లాడుతూ….అహింసా మార్గంలో స్వాతంత్రపోరాటం చేసి స్వాతంత్రం తీసుకువచ్చిన ఘనత మహాత్మాగాంధిగారిదని అన్నారు.భారతదేశంలో అన్ని రాష్ర్టాలకంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం,అభివృధ్ది పరంగా ముందుందని దీనికి ప్రధాన కారణం మహాత్మాగాంధీ చూపిన బాటలో వైయస్ జగన్ నడవడమేనని అన్నారు.
ఎంఎల్సి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ…..మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి లు అందరికి స్పూర్తి అని అన్నారు.మహోన్నత విలువలు పాటిస్తూ వారు చేసిన అనేక త్యాగాల ఫలితమే నేటి మన స్వేఛ్చాభారతదేశం అన్నారు.బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వారు చూపిన తెగువ,పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని అన్నారు.ఆ మహనీయులు ఏదైతే కోరుకున్నారో వాటిని తూచతప్పకుండా అమలు చేస్తూ రాష్ర్టంలో బడుగు,బలహీన,మైనారీటి పేదవర్గాలను ఉన్నత స్దానంలోకి తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పనిచేస్తున్నారని అన్నారు.
ఎంఎల్ ఏ కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ….మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి చూపిన బాటలో వైయస్ జగన్ నడుస్తూ ప్రజలకు మేలు చేసే అనేక నిర్ణయాలు అమలు చేస్తున్నారని ఇది అందరికి మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.