-అడుగడుగునా తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి
-అలాంటి వ్యక్తి రాజశేఖరరెడ్డి బిడ్డనే షర్మిల
-వైయస్సార్ తెలంగాణ పార్టీ టైటిల్ కు తెలంగాణకు పొందిక లేనే లేదు
-షర్మిలా..! నీ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే.. తెలంగాణ కాదు
-బిజెపి బిజెపి వదిలిన కార్యకర్త షర్మిల
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, తెలంగాణ ప్రాంతానికి పచ్చి వ్యతిరేకి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.గురువారం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండల టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో, వరంగల్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంతంలోని దీక్షా దివస్ శిబిరం వద్ద వినోద్ కుమార్ మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వైయస్సార్ ఎన్నడూ గౌరవించలేదని, అడుగడుగునా తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనే షర్మిల అని వినోద్ కుమార్ తెలిపారు. షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీ టైటిల్ కు.. తెలంగాణకు పొందిక లేనేలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.షర్మిలా..! మీ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అని, తెలంగాణ ఏ మాత్రం కాదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
బిజెపి వదిలిన కార్యకర్త షర్మిల అని, పచ్చని తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకే షర్మిల రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో షర్మిల ఇటీవల భేటీ అయ్యారని, ఆ తర్వాత షర్మిల తెలంగాణపై దాడికి దిగారని వినోద్ కుమార్ అన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్స్ కు వ్యతిరేకి అయిన బిజెపిని నిలదీయాలని, కానీ బిజెపి కనుసన్నల్లో షర్మిల పని చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ సమాజాన్ని, ప్రజలను మభ్యపెట్టి దెబ్బతీసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకునేందుకు దేశంలోని 36 పార్టీల మద్దతు కూడగట్టుకుని అన్ని వర్గాలను సమీకరించి మహోజ్వల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వినోద్ కుమార్ వివరించారు.
ప్రజా పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ తెలంగాణలో ప్రజా తీర్పుతో అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రైతులకు ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని, అలాంటి పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు ఒకవైపు బిజెపి, మరోవైపు షర్మిల యత్నిస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదని వినోద్ కుమార్ అన్నారు.