• రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి
– YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల
YSR తెలంగాణ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు జెండా ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ…‘‘చట్టాలు పాలకులకు ఒకలా, ప్రజలకు, ప్రతిపక్షాలకు
మరోలా వర్తిస్తున్నాయి. పోలీసు వ్యవస్థను పనివాళ్లలాగా పాలకులు వాడుకుంటున్నారు. పాలకులు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఓట్లు గుంజుకున్నాక ఏమైనా చేయొచ్చా..? ఇదే కదా మన దేశంలో జరుగుతోంది..? ఎన్నికల ముందు నాయకులు ఒక మాట ఇచ్చి గెలిచాక వారు ఆ హామీకి కట్టుబడి ఉండే విధంగా చట్టం తీసుకురావాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా నిబంధనలు ఉండాలి. రాజ్యాంగం ఏర్పడి 73 సంవత్సరాలు అయినా, రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ఇప్పటి వరకు ఎవరికీ అందలేదు.
నిన్న సాగర్ అనే యువకుడు ఉద్యోగం లేక, నోటిఫికేషన్ రావడం లేదని ట్రైన్ కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు రావడం లేదని, రైతులు అప్పులు తీర్చలేక ఇలా మన రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మనస్సులో ఎంత క్రుంగిపోతే ఒక వ్యక్తి తనను తాను సజీవ దహనం చేసుకుంటారు. ఎంత మంది ఐతే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారో…తెలంగాణ వచ్చాక కూడా అంతకు మించి ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. పాలకులు ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత మంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కేసీఆర్. ప్రభుత్వ ఉపాధ్యాయులు 317 జీవోతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ఎన్నికలప్పుడే పథకాలు వదిలి, ఎన్నికలు ముగిశాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు.